సైబరాబాద్ ‘హైటెక్‌ సిటీ’ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి

  • 11 డిసెంబర్ 2018
నారా చంద్రబాబు నాయుడు Image copyright tdp.ncbn.official/facebook

సైబరాబాద్‌ను తానే నిర్మించానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు.

అయితే, అలాంటి చోటే టీడీపీ ఓడిపోయింది. మహాకూటమి సీట్ల కేటాయింపుల్లో భాగంగా సాఫ్ట్ వేర్ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న శేరిలింగపల్లి నియోజకవర్గాన్ని టీడీపీ సాధించికుంది. తమ అభ్యర్థిగా భవ్య ఆనంద్ ప్రసాద్‌ను బరిలోకి దింపింది.

అయితే, హైటెక్ సిటీని అభివృద్ధి చేశానన్న చంద్రబాబు ప్రచారం పనిచేయలేదని ఎన్నికల ఫలితాన్ని బట్టి అర్థమవుతోంది.

అక్కడ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన అరికె పూడి గాంధీ దాదాపు 43,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించి, టీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకే టీఆర్ఎస్ టికెట్ దక్కింది.

టీడీపీ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఖమ్మం జిల్లా, హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి, తమ అభ్యర్థులు గెలుస్తారని ఆశించింది. ఈ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతం వారు అత్యధికంగా స్థిరపడ్డారు. వారు తమను ఆదరిస్తారని టీడీపీ భావించింది.

టీడీపీకి బలమైన పట్టుకున్న కూకట్‌పల్లిలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా