కేసీఆర్‌, కేటీఆర్‌లకు అభినందనలు తెలిపిన జగన్, పవన్, మహేశ్ బాబు, లోకేశ్: ‘ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది’ - తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

  • 11 డిసెంబర్ 2018
సీఎం కేసీఆర్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ Image copyright cmotelangana/facebook

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందించారు.

‘‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కె. చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హ‌ృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది’’ అని పవన్ పేర్కొన్నారు.

‘‘తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటను మరోసారి చాటి చెప్పారు‌’’ అని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పవన్ అభినందనలు తెలిపారు.

‘‘తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్ అభినందనలు

‘‘హార్థిక శుభాభినందనలు కేసీఆర్ గారు. మీ సుపరిపాలన పట్ల ప్రజలు మరోమారు నమ్మకం ఉంచారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతరుల మధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని పూర్తిగా తిప్పికొట్టారు’’ అని వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

లోకేశ్ ట్వీట్

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారికి హార్థిక శుభాభినందనలు. అలాగే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలకు అభినందనలు’’ అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

ప్రముఖుల అభినందనలు

కేసీఆర్‌కు.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా అభినందనలు తెలిపారు.

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘‘విజయం సాధించినందును భారీ అభినందనలు.. మీకు తగిన (విజయం) ఇది. ప్రజల మనిషిగా కొనసాగండి. మీకు ఆల్ ది వెరి బెస్ట్’’ అని ట్వీట్ చేశారు.

టాలీవుడ్ హీరో నాని కేటీఆర్‌కు, టీఆర్ఎస్‌కు అభినందనలు తెలుపుతు.. ‘‘తెలంగాణ ప్రజలు తమవంతు చేశారు.. ఇక మీరు బంగారు భవిష్యత్ కోసం మీ వంతు పాటుపడతారని విశ్వసిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ బదిలీపై ఎవరు ఏమంటున్నారు?

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...

దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?

కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు

అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...

దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న అజిత్ డోభాల్

ముకేశ్ అంబానీ సంపాదన గంటకు ఏడు కోట్లు : ప్రెస్ రివ్యూ

కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?