ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి? ఎంత ప్రమాదకరం?

  • 15 డిసెంబర్ 2018
మహిళ Image copyright Getty Images

ఎండోమెట్రియాసిస్... మహిళలకు వచ్చే ఆ అనారోగ్య సమస్య గురించి కొందరికే తెలుసు.

ఎండోమెట్రియాసిస్ కారణంగా మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి.

క్రమం తప్పిన నెలసరి, తీవ్ర రక్త స్రావం, నెలసరి సమయంలో అధికంగా నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, సంభోగం సమయంలో నొప్పి లాంటి సమస్యలూ ఉంటాయి.

పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి కలగొచ్చు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎండోమెట్రియాసిస్ లక్షణాలేంటో ఈ వీడియోలో చూడండి

ఎండోమెట్రియాసిస్ కారణంగా గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోవచ్చు.

గర్భాశయం చుట్టూ ఉండే కణజాలం ఇతర శరీర భాగాల్లోకి విస్తరించినప్పుడు ఎండోమెట్రియాసిస్ సమస్య మొదలవుతుంది.

తొలి దశలో అల్ట్రా సౌండ్ స్కానింగ్‌ ద్వారా ఆ సమస్యను సులువుగా గుర్తించొచ్చు.

సమస్య తీవ్రమైన దశలో ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని గుర్తిస్తారు.

కొన్ని కేసుల్లో ఒక శస్త్రచికిత్సతో అది నయమవుతుంది.

కానీ, మరికొన్ని కేసుల్లో 3-4 శస్త్ర చికిత్సలు చేయాల్సి రావొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు