జీరోగా మారినా.. జీవితం అంతమైపోదు: షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, IamSRK/facebook
షారుఖ్ ఖాన్... పరిచయం అక్కర్లేని బాలీవుడ్ సూపర్ స్టార్. డిసెంబర్ 21న ఆయన నటించిన 'జీరో' సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయన బీబీసీతో మాట్లాడారు. సినిమాతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఆయన పంచుకున్నారు.
జీరో సినిమా ప్రత్యేకత ఏంటి?
షారుఖ్: జీరో సినిమా కోసం దాదాపు రెండున్నర ఏళ్ల పాటు కష్టపడ్డాం. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు చాలా కీలకం. వాటి కోసం వెయ్యిమందికి పైగా పనిచేశారు. కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆ ఎఫెక్ట్స్ తేలేదు. కథలో వాటికి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే వాటి కోసం అంత శ్రమించాం.
సినిమాలోని బావ్వా సింగ్ లాంటి సాధారణంగా బాధతో కూడుకొని ఉంటాయి. కానీ మీ పాత్ర అందుకు భిన్నంగా ఎంతో ఉత్తేజంగా ఉంది. మీకు ఈ పాత్రలో ఏం నచ్చింది?
షారుఖ్: ఆనంద్ గారు(డైరెక్టర్) ముగ్గురు విభిన్న వ్యక్తులకు సంబంధించిన చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతి మనిషిలో ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి కోల్పోయిన బాధ కలుగుతుంది, అది మానసికమైనది కావచ్చు, లేదా శారీరకమైనది కావచ్చు. "పరిస్థితులు సరిగ్గా లేవు, ఆనందంగా లేము, మనశ్శాంతి లేదు" అని అనుకుంటూ ఉంటాం. ఆ బాధల్లో పడిపోయి జీవితాన్ని ఆనందంగా గడపటం మరిచిపోతాం. అందుకే ఈ చిత్రంలో ఒక మంచి అంశం ఉంది. ఇందులో ఏ పాత్రైనా సరే ఏదైనా విషయాన్ని ఏదో బాధపడుతూ అయ్యయ్యో అంటూ నేర్పించట్లేదు, ఆనందంతో నేర్పిస్తుంది.
మేము ఆనందంగా ఉన్నాం. మీలో కూడా ఒకవేళ ఇటువంటి వైకల్యాలు ఉంటే మేం సినిమాలో చూపించినంత అతిశయంగా కాకపోయినా "నేను ఇలా అవ్వాలనుకున్నా, నేను అలా అవ్వాలనుకున్నా, కానీ ఎందుకు ఇలా జరిగింది" అంటూ జీవితాన్ని ఆనందంగా గడపటం మాత్రం ఆపొద్దు. మా కథ పూర్తిగా ఇదే అంశం గురించి చెబుతుంది, బావ్వా సింగ్ పాత్ర, లేదా అనుష్క చేసిన పాత్ర ఉద్దేశం కూడా ఇదే. కాకపోతే మాకున్న లోపాలు భిన్నమైనవి. జీవితంలో మీకెప్పుడైనా అథఃపాతాళానికి పడిపోయామని అనిపించినా, పూర్తిగా జీరో అయిపోయామని భావించినా ఆ సమయంలో జీవితం అంతమైపోయిందని అనుకోకండి. మనకు మరొక అవకాశం లభించిందని భావించండి. జీవితం పట్ల సానుకూలంగా ఉండండి.
బాజీగర్ నుంచి జీరో వరకు మీ చిత్రాల్లోని డైలాగులు ఎంతో మంది జీవితాలను మార్చేశాయి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. అలా మీ చిత్రాల్లోని డైలాగులు ఏవైనా మీ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయా. ఏదైనా మీ మనసుకి నచ్చిన డైలాగ్...
షారుఖ్: అంటే నేను రాయలేదు కానీ.. రెండు మూడు డైలాగులు ఉన్నాయి. ఈ జీరో చిత్రంలోని ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. "కథలలో చదివాను ప్రేమికుడు తన ప్రేమ కోసం చంద్రుడిని కూడా తీసుకురాగలడు అని. కానీ నేను ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గానే తీసుకున్నాను" అన్న డైలాగ్ నాకు ఎంతో నచ్చింది.
ఈ మధ్య వెబ్ సిరీస్లు ఎక్కువగా వస్తున్నాయి. వాటిని ఏమైనా నిర్మించాలనుకుంటున్నారా?
షారుఖ్: మా రెడ్ చిల్లీస్ బ్యానర్లో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ను రూపొందిస్తున్నాం. అందులో నేను నటించడం లేదు. ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. రెండు మూడు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది.
ఇవి కూడా చదవండి
- మహాత్మా గాంధీపై బాబా సాహెబ్ అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
- చంపారన్: ‘‘నేను దేవుణ్నీ, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను’’
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- అమెరికా, నెదర్లాండ్స్లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- షారుఖ్ ఖాన్ తల్లిది హైదరాబాదే
- బాలీవుడ్లో మహిళలను చూపించే విధానం మారాలి
- వోగ్ మ్యాగజీన్ కవర్ పేజీపై షారూఖ్ ఖాన్ కుమార్తె.. సినీ జనుల ఆగ్రహం ఎందుకు?
- మన 'హీరో నంబర్ 1' ఏమైపోయాడు?
- ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టూ వేధింపేనా?
- ఒక్కసారి కన్ను గీటి కోట్ల హృదయాలను దోచేసిన అమ్మాయి కథ ఇదీ!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)