వీడియో: ఆతిథ్యం ఎండిపోయింది.. పక్షి ఎగిరిపోయింది

వీడియో: ఆతిథ్యం ఎండిపోయింది.. పక్షి ఎగిరిపోయింది

గుజరాత్‌లోని నల్‌సరోవర్ సరస్సు కళ తప్పుతోంది. ప్రతి ఏటా చలికాలంలో వలస వచ్చే విదేశీ పక్షులకు ఆతిథ్యం ఇచ్చే ఈ సరస్సు, ఇప్పుడు వెలవెలబోతోంది.

నీరు లేక సరస్సు ఎండిపోవడంతో ఫ్లెమింగో వంటి పక్షులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో ఇక్కడకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది.

ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి జీవించే స్థానికులు, పడవ వాళ్లు బతుకుతెరువు కోసం పక్షుల్లాగే వలసబాట పడుతున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛర్రా అందించిన కథనాన్ని పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)