పెల్లెట్ గాయాల పాలైన బాధితుల్లో అతి పిన్న వయసు హిబాదే

పెల్లెట్ గాయాల పాలైన బాధితుల్లో అతి పిన్న వయసు హిబాదే

హిబా నిసార్ వయసు 20 నెలలు. కశ్మీర్‌లో భద్రతా బలగాలు పేల్చిన పెల్లెట్ ఈ పసికందు కుడి కంటికి గాయం చేసింది. నెల రోజుల వ్యవధిలో హిబాకు రెండు సార్లు సర్జరీ చేశారు. కశ్మీర్‌లో పెల్లెట్ గాయాల బాధితుల్లో అతి పిన్న వయసు హిబాదే.

‘‘మా పొరుగు గ్రామంలో ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో మేం ఇళ్లలోనే ఉండిపోయాం. అంతలో మా ఇంటికి సమీపంలో.. ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మా గదులన్నీ టియర్ గ్యాస్‌తో నిండిపోయాయి. మేం గదిలోంచి వరండాలోకి వచ్చాం. ఇంతలో ఏదో తగిలినట్లు అనిపించింది. హిబా కుడి కంట్లోంచి రక్తం కారసాగింది. నా చేయి అడ్డు పెట్టి, పాపను కాపాడే ప్రయత్నం చేశాను. నా చిన్నారి గుక్కపెట్టి ఏడ్వసాగింది’’ అని హిబా తల్లి మర్సాలా అన్నారు.

పెల్లెట్ అంటే ఏమిటి? కశ్మీర్‌లో దీన్ని ఎప్పటినుంచి వాడుతున్నారు? మరింత సమాచారం కోసం పైనున్న వీడియో క్లిక్ చేసి, మీరు కూడా హిబాను పలకరించండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)