వైరల్ 2018: బుల్‌బుల్ నుంచి నిలదీస్ఫై వరకు.. ఫసక్

  • 30 డిసెంబర్ 2018
మోహన్ బాబు, బాలకృష్ణ Image copyright facebook/NandamuriBalakrishna

2018 కొన్ని కొత్త పదాలను ఇచ్చి వెళ్తోంది. సరదాగా కొందరు.. సమాధానం దొరక్క మరికొందరు.. తడబడి ఇంకొందరు తమ మాటల్లో కొత్త పదాలతో ప్రయోగం చేశారు. అవన్నీ ఈ ఏడాది వైరల్‌గా మారాయి.

వాటిని సృష్టించిన ఆ ప్రముఖులు వాటిని ఒక్కసారే అని ఊరుకున్నప్పటికీ లక్షలాది మంది నోళ్లలో అవి నానుతూ ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేశాయి. అలాంటి కొన్ని '2018 వైరల్స్' కొన్ని..

Image copyright vishnu/twitter

ఇటీవల సినీనటుడు మోహన్ బాబు ఓ ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ 'వన్స్ ఫసక్' అన్నారు. తర్వాత ఆ పదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ పదానికి సరైన అర్థం ఏంటో తెలియదు. కానీ, చాలా మంది 'వన్స్ ఫసక్' అనే పదాన్ని తమకు నచ్చిన తీరులో వాడుకుంటున్నారు.

గూగుల్‌లో ఇప్పటికే 6,67,000 మంది #fasak పేరుతో వెతికారు. ఇక ఫేస్‌బుక్‌లో ఫసక్‌ పేరుతో చాలా గ్రూప్‌లో క్రియేట్ చేశారు. ట్విటర్ హ్యాష్‌డాగ్‌లోనూ ఫసక్ ప్రముఖంగా కనిపించింది.

దీనిపై మోహన్ బాబు కుమారులు సినీ నటులు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న ట్విటర్ వేదికగా స్పందించారు. వారు కూడా కొన్ని సందర్భాలకు ఫసక్ పదాన్ని వాడుతూ ట్వీట్‌లు చేశారు.

Image copyright NANDAMURI SUHASINI/FB

బాలయ్య... బుల్ బుల్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటుడు బాలకృష్ణ చేసిన ఒక ప్రసంగం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున బాలకృష్ణ హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన ఒక రోడ్డు షోలో 'సారేజహాసే అచ్చా హిందూ సితా హమారా' గీతాన్ని ఆలపించడానికి ప్రయత్నించి బుల్ బుల్ అంటూ తడబడ్డారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచు లక్ష్మి... నిలదీసిఫై

సినీ నటి మంచు లక్ష్మి చేసిన ఒక వ్యాఖ్య కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు పై స్పందిస్తూ 'ఐ వాంటూ నిలదీసిఫై' అనే పదాన్ని వాడారు. తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఈ పదంతో స్కూప్‌లు, మీ మ్స్చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Image copyright MODI/fb

మోదీ.. పుదుచ్చేరికో వణక్కం

ప్రధాన మంత్రి మోదీ వాడిన ఓ పదం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో ' నమో' యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంలో నిర్మల్‌కుమార్‌ జైన్‌ అనే కార్యకర్త 'మీ ప్రభుత్వం మధ్యతరగతి వారి నుంచి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ వారి బాగోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు?' అని అడిగారు.

అప్పుడు మోదీ అతని ప్రశ్నను పక్కనబెట్టి 'పుదుచ్చేరికో వణక్కం' అంటూ వేరే కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో ఈ పదం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై ట్విటర్ వేదికగా రాహుల్ స్పందించారు. 'వణక్కం పుదుచ్చేరి!- ఇబ్బందులు పడుతోన్న మధ్యతరగతి ప్రజలకు మోదీ ఇస్తున్న సమాధానం ఇదే’ అంటూ విమర్శించారు. నెటిజన్లు వివిధ సందర్భాలకు 'వణక్కం పుదుచ్చేరి’ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ట్విటర్‌లో ఈ పదం హ్యాష్‌టాగ్‌గా మారింది.

'ఇకపై ప్రశ్నపత్రాల్లో ఉండే NOTA(None of the above) బదులుగా వణక్కం పుదుచ్చేరి పదాన్ని వాడాలని మేం కోరుతున్నాం అని మింటో అనే నెటిజన్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు.

'కొత్త పదం పుట్టింది. I don't know = Chaliye Puducherry to Vanakkam’ అంటూ బ్లాంక్ చెక్ అనే మరో నెటిజన్ స్పందించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)