భీమా కోరెగాం: హింస జరిగి ఏడాది.. ఇప్పుడక్కడ ఎలా ఉంది
- శ్రీకాంత్ బంగాలె
- బీబీసీ ప్రతినిధి

భీమా కోరెగాం ఘర్షణలు
ఏటా జనవరి 1న దేశవ్యాప్తంగా దళితులు మహారాష్ట్రలోని భీమా కోరెగాంలో ఉన్న విజయ స్తంభం(యుద్ధ స్మారకం) దగ్గర భారీగా చేరుకుంటారు.
ఇక్కడ అందరూ కలిసి మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధంలో విజయంలో పోరాడిన మహార్ రెజిమెంట్‌కు నివాళులు అర్పిస్తారు.
భీమా కోరెగాం యుద్ధంలో ఈస్టిండియా కంపెనీకి చెందిన మహర్ రెజిమెంట్ మరాఠాలను ఓడించింది. అప్పట్లో మహార్లను మహారాష్ట్రలో అంటరానివారిగా చూసేవారు.
ఈ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జనవరి 1న నిర్వహించిన కార్యక్రమంలో హింస చెలరేగింది.
ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపైనా పడింది. ఈ హింసలో ఒక వ్యక్తి మృతి చెందడంతో రాష్ట వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి.
దీంతో ఈసారీ ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పుణె జిల్లా కలెక్టర్ నవల్ కిశోర్ రాం దీని గురించి బీబీసీకి వివరాలు అందించారు.
భీమా కోరెగాంలో ఈసారి జరగబోయే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
మేం గత రెండు నెలలుగా సన్నాహాలలో ఉన్నాం. మేం ఇక్కడ ఐదు నుంచి పది లక్షల మందిని సులభంగా అదుపు చేయగలం.
ఫొటో సోర్స్, BBC/MAYURESH KONNUR
పార్కింగ్ కోసం 11 స్థలాలు ఏర్పాటు చేశాం. కార్యక్రమానికి వచ్చే వారు తమ వాహనాలను అక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది.
అక్కడి నుంచి స్మారకం వరకూ మా వాహనాలు ఉంటాయి. అందుకోసం మేం 150 బస్సులు ఏర్పాటు చేశాం. 100 నీళ్ల ట్యాంకర్ల కూడా తెప్పించాం.
స్మారకం దాని చుట్టుపక్క 7-8 కిలోమీటర్ల పరిధిలో సీసీటీవీలు ఏర్పాటు చేశాం. నిఘా పెట్టడానికి డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నాం.
భీమా కోరెగాం వెళ్లే అన్ని మార్గాలను మా చేతిలోకి తీసుకున్నాం. చాలా ప్రాంతాల్లో టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశాం.
గత ఏడాది హింసాత్మక ఘటనలు జరగడం వల్ల ఈసారి కూడా స్థానికులు భయపడుతున్నారా?
ఈసారీ మేం ప్రజలతో చాలా సమన్వయంతో ఉన్నాం. వారిలో ఎలాంటి భయాలు లేకుండా చేయడానికి చుట్టుపక్కల గ్రామస్థులతో సమావేశాలు కూడా జరిపాం.
నేను స్వయంగా 15-20 సమావేశాల్లో పాల్గొన్నాను. భీమా కోరెగాంలో పరిస్థితిపై నిఘా పెట్టాం. జనంలో ఎలాంటి భయం లేదు.
ఫొటో సోర్స్, BBC/MAYURESH KONNUR
ర్యాలీ కోసం ఏయే సంస్థలకు, నిర్వహకులకు అనుమతులు ఇచ్చారు?
ఐదు నుంచి ఆరుగురు నిర్వాహకులు ర్యాలీలకు అనుమతి అడిగారు. వారందరికీ అనుమతులు ఇచ్చాం. వారందరూ కొన్ని రోజుల ముందే అడిగారు. అయినా వెంటనే అనుమతులు ఇచ్చేశాం.
గత ఏడాది జరిగిన హింస దృష్ట్యా ఈసారి ర్యాలీకి అనుమతులు ఇవ్వడం ప్రమాదం కాదంటారా?
మేం ప్రధాన ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. స్మారకానికి 500 మీటర్ల దూరం వరకే ర్యాలీలను అనుమతిస్తాం.
ర్యాలీ కోసం ఏవైనా షరతులు పెట్టారా?
ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వేరు చేసేలా మాట్లాడడం నిషేధించాం. నిర్వాహకులందరూ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. అలా పాటించని వారిపై కఠిన విచారణకు ఆదేశిస్తాం.
గత ఏడాది జరిగిన హింస కేసులో నిందితులపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది, నిజమేనా?
2018 జనవరి 1న జరిగిన హింస కేసులో ఎవరిపైన కేసులు నమోదు చేశారో, వారిపై నిషేధం విధించాం.
శంభాజీ భిదె, మిలింద్ ఎక్బొటెలపైనా నిషేధం విధించారా?
హింసకు సంబంధించిన కేసులో నిందితులపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నా దగ్గర వ్యక్తులు, లేదా సంస్థకు సంబంధించిన పేర్లు లేవు. కానీ నిందితులు ఎవరూ భీమా కోరెగాం రావడానికి కుదరదు.
ఇవి కూడా చదవండి:
- టాయిలెట్ కట్టించని తండ్రిని అరెస్ట్ చేయమన్న కూతురు
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- యమునా నదిలో ఈ విషపూరిత నురగ ఎందుకొస్తోంది?
- #BBCSpecial: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇళ్లు.. హైదరాబాదీ వినూత్న ప్రయత్నం
- వాయు కాలుష్యం: హైదరాబాద్‌లో ఉంటే.. రోజుకు రెండు సిగరెట్లు తాగినట్లే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
అభిప్రాయం: ‘భీమా-కోరెగాం అల్లర్ల వెనుక అసలు కుట్ర ఏమిటి?’
మహారాష్ట్రలో ఆత్మగౌరవ నినాదం చేస్తున్న దళితులపై దాడి వెనుక కుట్ర ఉందా? భీమా-కోరెగాం అల్లర్లపై సీనియర్ జర్నలిస్ట్ సుజాతా ఆనందన్ విశ్లేషణ.