విజయనగర సామ్రాజ్యం శిథిలమైనా... డిజిటల్‌గా సజీవం

హంపి

అయిదు వందల ఏళ్ల కిందట ఆ నగరం కళలు, సాహిత్యానికి ప్రధాన కేంద్రం.. అక్కడి వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారు.. అంతటి సుసంపన్న సామ్రాజ్యం ఇప్పుడు లేదు.

అయితే, ఆ రాజ్యంలో ధనధాన్యాలతో విలసిల్లిన నగరం ఇప్పుడు శిథిలమైనా ఇప్పటికీ తన వన్నె కోల్పోలేదు.

అదే హంపి. 13-15వ శతాబ్దాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య రాజధాని.

ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. ఉత్తరాన తుంగభద్ర నది.. మిగతా మూడు వైపులా భారీ గ్రానైట్ శిలలతో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కడుతుంది.

హంపి చరిత్రను శాశ్వతం చేసేందుకు డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు.

ఇందుకోసం దీన్ని వర్చువల్‌గా పునర్నిర్మించారు.

విఠల ఆలయం

హంపిలోని ప్రధాన ఆకర్షణల్లో విఠల ఆలయం ప్రాంగణం ఒకటి. రథం ఆకారంలోని ఆలయం, వంద కాళ్ల మండపం ఇక్కడి ప్రత్యేకతలు.

శివుడి కోవెల

హిందూ దేవతల విగ్రహాలు చెక్కిన స్తంభాలతో ఈ ఆలయం కనులవిందుగా ఉంటుంది.

పద్మ మందిరం

హంపిలో ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న మందిరం ఇది. ఎటు నుంచి చూసినా ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.

కోట బురుజు

పద్మ మందిరం, ఏనుగుల శాలలకు పహారా కాసేందుకు బురుజుపై సైనికులు ఉండే ప్రదేశం

ఏనుగుల శాలలు

రెండేసి ఏనుగులు ఒకేసారి వెళ్లగలిగేటంతటి ద్వారాలున్న ఈ మనోహరమైన శాలలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి.

తుంగభద్ర నది

హంపి సందర్శకులు అక్కడి తుంగభద్ర నదిలో స్నానం చేయకుండా వెళ్లరు.

ఆలయ గజాలు

కోవెల ఏనుగు లక్ష్మికి మావటి రోజూ ఉదయాన్నే తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తాడు.

హంపిలో సూర్యాస్తమయం

సూర్యాస్తమయ వేళ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలంటే హంపి వెళ్లాల్సిందే. హంపి వద్ద నుంచి చూస్తే సూర్యుడు అక్కడి పడమటి కొండల్లోంచి మెల్లగా కనుమరుగవడం.. ఆ సమయంలో కొండలు, పెద్దపెద్ద బండలు అన్నీ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తూ మెల్లమెల్లగా చీకట్లో చిక్కుకోవడం చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)