రఫేల్ డీల్: మోదీపై రాహుల్ గాంధీ వేస్తున్న నిందలు సరే... నిజాలెక్కడ

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బకొట్టడంలో విజయం సాధించారు. దాంతో పార్లమెంటులో రాహుల్ గాంధీ గర్వపడటానికి కావల్సిన కారణం దొరికింది.
లోక్‌సభ ఎన్నికల్లో కూడా మోదీని గద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలనన్న నమ్మకం కూడా ఆ విజయం ఆయనకు కల్పించింది.
కొత్తగా వచ్చిన ఈ నమ్మకం రాహుల్‌కు కొత్త దూకుడును కూడా తీసుకొచ్చింది.
ఆయన్ను ఇకపై ‘పప్పు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదని ఆయనకు తెలుసు. ఇతరులకు కూడా ఆ విషయాన్ని రాహుల్ తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ప్రతిపక్షాన్ని ముందుకు నడిపే సమర్థ నాయకుడిగా ఆయనకు ఆమోద ముద్ర పడింది. పార్లమెంటులో రాహుల్ ప్రణాళికలో ఎలాంటి లోపం లేదు. కాకపోతే పార్లమెంటులో మోదీని లక్ష్యంగా చేసుకోవడానికి నిజాలకు బదులుగా ఆయన నిందా మార్గాన్ని ఎంచుకున్నారని కొందరి అభిప్రాయం.
బహిరంగ సభల్లో అయితే వాక్పటిమతో, ఆరోపణలతో బండి నడిపించొచ్చు. కానీ, ప్రజాక్షేత్రంలో బలమైన నాయకుడిగా నిలబడాలంటే మాత్రం పార్లమెంటును సమర్థంగా వినియోగించుకుంటూ, ప్రత్యర్థిని దెబ్బతీసేలాగా జాగ్రత్తగా పదజాలాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్లాలి. దురదృష్టవశాత్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో రాహుల్ విఫలమయ్యారు.
ఇప్పటికే చేస్తున్న ఆరోపణలకు బదులుగా కొత్త వాస్తవాలను పార్లమెంటు ముందుకు తీసుకురావడం పోయి, మోదీని అవినీతి, ద్వేషపూరిత, నియంతృత్వ నేతగా చిత్రించే ప్రయత్నమే ఎక్కువగా చేశారు. ఆఖరికి రఫేల్ డీల్ విషయంలో లోక్‌సభలో గోవా మంత్రికి సంబంధించిన ఆడియో టేపులను వినిపించడానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా చిన్నస్థాయి చర్యలానే కనిపిస్తుంది. (ఆ టేపుల ప్రామాణికతను రూఢీ చేయమని లోక్ సభ స్పీకర్ అడిగినప్పుడు రాహుల్ మిన్నకుండిపోయారు)
గతేడాది జూలైలో లోక్‌సభలో కన్నుకొట్టి, మోదీని కౌగిలించుకొని రాహుల్ పత్రికల్లో పతాక శీర్షికగా మారారు. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం కూడా అలానే ఆయన మద్దతుదారులతో పాటు మీడియా దృష్టినీ ఆకర్షించొచ్చు.
కానీ, దేశ ప్రధానిగా ఎదగాలనుకునే నాయకుడికి మాత్రం ఇలాంటి చర్యలు ఏమాత్రం ఉపయోగపడవు. పార్లమెంటు చరిత్రలో అతడి నానమ్మ ఇందిరా గాంధీ, ముత్తాత నెహ్రూలా బలమైన ముద్ర వేయాలంటే, రాహుల్ పార్లమెంటు నిబంధనలను ఉల్లంఘించడానికి వీల్లేదు.
- రఫేల్ డీల్: అసలు ఏమిటీ ఒప్పందం... ఎందుకీ వివాదం?
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
మోదీ లాభాపేక్షతో వ్యవహరించారని సరైన ఆధారం చూపించకుండా, కేవలం ఆయన్ను ఇరుకున పడేయడానికి దగ్గరి దారులు వెతుక్కోవడం అటు రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌కు కూడా మంచిది కాదు.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరులో సుప్రీంకోర్టుకు ఎలాంటి అవినీతీ, తప్పూ కనిపించలేదు. అదే రాహుల్‌కు సమస్యలా మారింది. ఎలాంటి కొత్త రుజువూ చూపని పక్షంలో రాహుల్ దగ్గర ఆధారాలున్నాయని కూడా అనుకోవడానికి లేదు.
ఇప్పటిదాకా రఫేల్ విషయంలో అన్ని హద్దులనూ దాటి ప్రధానిని రాహుల్ ‘దొంగ’ అని పేర్కొన్నారు. సరైన ఆధారాలను దగ్గర పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసున్నట్లైతే వాటిని పట్టించుకునే అవసరం ఉండదు. కానీ, రాహుల్ అలా చేయలేదు.
చాలా తక్కువ వ్యవధిలోనే రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి, డసో సీయీవో... అంతా అబద్దాల కోరులని రాహుల్ పదే పదే ఆరోపించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ కూడా అబద్దం చెబుతున్నారనే అర్థంలో ఆయన మాట్లాడారు.
- పాస్‌పోర్టు ఎలా పుట్టింది... ఏ దేశం పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం అసాధ్యం?
- చైనా - తైవాన్ దేశాలు ఎందుకు విడిపోయాయి...
భారత వైమానిక దళ చీఫ్‌ను కాంగ్రెస్‌తో అబద్దాల కోరని చెప్పించారు. ఆఖరికి రఫేల్ విషయంలో తమకు రుచించని తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మినహా మిగతా అందరూ అబద్దాలు చెబుతున్నట్లే రాహుల్‌కు తోస్తోంది.
ఆఖరికి పార్లమెంటులో రాహుల్‌కు అరుణ్ జైట్లీ జవాబిచ్చే సమయంలో కాంగ్రెస్ నేతలు కాగితపు విమానాలు విసిరి స్పీకర్‌తో చీవాట్లు తిన్నారు. చివరికి ప్రతిపక్షం కోరిన సీరియస్ చర్చ కాస్తా తరగతి గదిలో గొడవలా మారిపోయింది.
ఇటీవల మోదీని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టును కూడా రాహుల్ మధ్యలోకి లాగకుండా ఉండాల్సింది. రాహుల్ గాంధీ కావాలంటే ఆ ఇంటర్వ్యూను తిరస్కరించొచ్చు. కానీ, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సామర్థ్యాన్ని, ఆమె ఉద్దేశాన్ని కూడా తక్కువగా చూడటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.
దాన్ని బట్టి ఆయన మీడియాకు విలువివ్వరనే భావన కలుగుతుంది. తమకు అనుకూలంగా లేని పాత్రికేయులను తప్పుగా చూసే వ్యక్తుల్లానే ఆయన కూడా మిగిలపోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి:
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)