అరుదైన వ్యాధితో బాధపడుతున్న మా బాబును బతికించండి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: అరుదైన వ్యాధితో బాధపడుతున్న మా బాబును బతికించండి

  • 23 జనవరి 2019

ఈ బాలుడి పేరు యదార్థ్. వయసు 6 నెలలు. ఈ చిన్నారి పడుతున్న బాధ గురించి తెలుసుకుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.

తమ పిల్లలు హాయిగా నిద్రపోవాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ యదార్థ్‌ కంటినిండా నిద్రపోయేందుకు అవకాశం లేదు.

ఎందుకంటే యదార్థ్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా ఒకవేళ బాలుడు గాఢ నిద్రలోకి వెళ్తే అతని ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది.

అందుకే, ఈ తల్లి తన బిడ్డను తరచూ గిల్లుతూ గాఢ నిద్రలోకి వెళ్లకుండా చూడాల్సి వస్తోంది.

ఈ చిన్నారికి ఉన్న రుగ్మతని ''సెంట్రల్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్'' అంటారు.

ప్రపంచవ్యాప్తంగా కేవలం 1300 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)