ఈ బాలుడు గాఢనిద్రలోకి వెళ్తే... అతని ప్రాణానికే ముప్పు

  • 23 జనవరి 2019
చిన్నారి, మహిళ

ఈ బాలుడి పేరు యదార్థ్. వయసు 6 నెలలు. ఈ చిన్నారి పడుతున్న బాధ గురించి తెలుసుకుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.

పిల్లలు హాయిగా నిద్రపోవాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ యదార్థ్‌ కంటినిండా నిద్రపోయే అవకాశం లేదు.

ఎందుకంటే యదార్థ్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దాని కారణంగా ఒకవేళ బాలుడు గాఢ నిద్రలోకి వెళ్తే అతని ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది.

అందుకే, ఈ తల్లి తన బిడ్డను తరచూ గిల్లుతూ గాఢ నిద్రలోకి వెళ్లకుండా చూడాల్సి వస్తోంది.

ఈ చిన్నారికి ఉన్న రుగ్మతని ''సెంట్రల్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్'' అంటారు.

ప్రపంచవ్యాప్తంగా కేవలం 1300 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅరుదైన వ్యాధితో బాధపడుతున్న మా బాబును బతికించండి

యదార్థ్ సమస్యకు చికిత్స ఉంది. కానీ, అది చాలా కష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత దిల్లీకి చెందిన ఈ కుటుంబానికి లేదు.

"నా బిడ్డకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. అదేదో అరుదైన వ్యాధి అని డాక్టర్లు చెప్పారు. బాబు గాఢనిద్రలోకి వెళ్లాడంటే నేను వాడిని గిల్లి లేపుతాను. లేదంటే వాడి శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. నేను గిల్లుతుంటే, వాడు ఏడుస్తాడు. ఇబ్బంది పడతాడు. ఓ తల్లిగా నా బిడ్డ గోడు చూడలేక ఎంతో బాధపడుతున్నా. ప్రతిసారీ నా బాబును నేనే గిల్లి, ఏడిపించాల్సి వస్తోంది" అంటూ యదార్థ్ తల్లి మీనాక్షి కన్నీళ్లు పెట్టుకున్నారు.

"ఇది జన్యులోపాల కారణంగా పుట్టుకతోనే వచ్చే వ్యాధి. శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు పెరుగుతున్నా శరీరంలోని నరాలు దాన్ని మెదడుకు చేరవేయడంలో విఫలమవుతున్నాయి. అందువల్ల అతడు గాఢ నిద్రలోకి వెళ్తే ఇబ్బందులు తప్పవు. ఆక్సిజన్ తగ్గి, ప్రాణాపాయ స్థితి తలెత్తవచ్చు" అని పిల్లల వైద్యుడు డాక్టర్ ధీరేన్ గుప్తా వివరించారు.

పిల్లలు గురక పెడుతున్నప్పుడు వాళ్ల శరీరం నీలంగా మారినా, ఉదయం లేవగానే అలసిపోయినట్టుగా ఉన్నా... వారికి శ్వాసపరంగా ఏదో ఇబ్బంది ఉందని అర్థం. అలాంటి పిల్లలకు వైద్య పరీక్షలు చేయాలని ధీరేన్ అన్నారు.

"ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాం. మా బాబు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తే, అవకాశం ఉంటే విదేశాలకు వెళ్లైనా మా బాబుకు చికిత్స చేయించి, బతికించుకుంటాం" అని యదార్థ్ తండ్రి ప్రవీణ్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ముంబయి వద్ద తీరం తాకిన పెను తుపాను... ఈదురు గాలులు, భారీ వర్షాలు

ఏది ప్రమాదకరం? అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి..

ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

ఏనుగు మరణం: పేలుడు పదార్ధాలను తినిపించటంతో.. గర్భంతో ఉన్న ఏనుగు మృతి

లాక్‌డౌన్ తర్వాత.. దిల్లీ - వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది

జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?

‘కేజీఎఫ్‌ గనుల్లో బంగారం కన్నా విలువైన లోహం.. వెలికితీతపై త్వరలో నిర్ణయం’

బ్రెయిన్ సర్జరీ జరుగుతుంటే... మద్దెల వాయించిన రోగి