అరకు బెలూన్ ఫెస్ట్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

Araku Balloon Festival : ఒక్కో బెలూన్ ఖరీదు రూ.1.5 కోట్లు

  • 22 జనవరి 2019

ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో మూడు రోజుల పాటు నిర్వహించిన బెలూన్ ఫెస్ట్ ఆదివారం ముగిసింది. విదేశాల నుంచి కూడా పైలెట్లు ఇక్కడకు వచ్చి ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

భారత్‌లో ఇప్పటి వరకు కేవలం రాజస్థాన్‌ ఎడారి ప్రాంతంలో, ఆగ్రాలో మాత్రమే బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినట్టు ఈ-ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సమిత్ తెలిపారు. గంగా నది పుష్కరాల సందర్భంగా లక్నోలో కూడా ఓసారి బెలూన్ ఫెస్టివల్ జరిగిందన్నారు.

అరకు కేంద్రంగా 2017లోనే బెలూన్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేశారు. కానీ, వర్షాల కారణంగా అప్పట్లో బెలూన్‌లు ఎగురవేయడం సాధ్యంకాలేదు. ఈసారి జనవరి 18 నుంచి 3 రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించారు.

ఈ ఫెస్టివిల్‌లోని విశేషాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)