IND Vs NZ: కివీస్‌పై భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్ట్ సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను గెలుచుకుని రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన భారత్‌కు శుభారంభం లభించింది.
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం నేపియర్‌లోని మెక్లీన్ పార్క్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
కివీస్ 157 పరుగులకే అదీ 38 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా బ్యాట్సెమెన్ కళ్లలోకి సూర్యరశ్మి నేరుగా పడుతుండటంతో మధ్యలో కొంతసేపు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ కారణంగా ఇన్నింగ్స్‌ను 50 ఓవర్ల నుంచి 49 ఓవర్లకు కుదించారు. లక్ష్యాన్ని 156కు తగ్గించారు.
భారత్ రెండు వికెట్లు నష్టపోయి 34.5 ఓవర్లకే సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట.. ఎవరికీ సాధ్యం కానిది కోహ్లీకే సాధ్యమైంది
ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగుల స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడారు.
కోహ్లీ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. తర్వాత అంబటి రాయుడితో కలిసి శిఖర్ ధావన్ మ్యాచ్‌ను ముగించారు. శిఖర్ ధావన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
- శబరిమల ఆలయంలోకి వెళ్లిన కనకదుర్గను ఇంట్లోకి రానివ్వని భర్త
- విరాట్ కోహ్లీకి ఐసీసీ అవార్డుల పంట.. ఎవరికీ సాధ్యం కానిది కోహ్లీకే సాధ్యమైంది
అంతకుముందు భారత బౌలర్లు అసాధారణంగా రాణించి కివీస్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు.
ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో ఇద్దరినీ మొహమ్మద్ షమీ తాను వేసిన రెండు వరుస ఓవర్లలో బౌల్డ్ చేశాడు. షమీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. ఆయనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ రాణించారు. టాప్ స్కోరర్ విలియమ్సన్ వికెట్ సహా నాలుగు వికెట్లను కుల్దీప్ కూల్చాడు. రాస్ టేలర్ వికెట్ సహా రెండు వికెట్లను చాహల్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శనతో షమీ ప్రపంచ కప్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్లో వ్యాఖ్యానించారు.
కివీస్ ఆటగాళ్లలో కెప్టెన్ విలియమ్సన్ అత్యధికంగా 64 పరుగులు సాధించాడు. రాస్ టేలర్ 24 పరుగులు చేశాడు. ఆరుగురు ఆటగాళ్లు పదిలోపు వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగారు.
భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్)
శిఖర్ ధావన్
రోహిత్ శర్మ
అంబటి రాయుడు
ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్)
కేదార్ జాదవ్
విజయ్ శంకర్
భువనేశ్వర్ కుమార్
కుల్దీప్ యాదవ్
మొహమ్మద్ షమీ
యజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్(కెప్టెన్)
మార్టిన్ గప్తిల్
కొలిన్ మున్రో
రాస్ టేలర్
హెన్రీ నికోల్స్
టామ్ లాథమ్(వికెట్ కీపర్)
మిషెల్ శాంటర్
డౌగ్ బ్రేస్‌వెల్
టిమ్ సౌతీ
లాకీ ఫెర్గూసన్
ట్రెంట్ బౌల్ట్
ఇవి కూడా చదవండి:
- అరకు బెలూన్ ఫెస్ట్ : ఒక్కో బెలూన్ ఖరీదు రూ.1.5 కోట్లు
- 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో బీసీ కోటా ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేరు
- చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది
- మీరు రిస్కీ నిర్ణయాలు తీసుకోవటానికి కారణాలేమిటి
- అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నోళ్లు ‘100 ఏళ్లు బతుకుతున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)