ప్రియాంకా గాంధీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం

  • 23 జనవరి 2019
ప్రియాంక Image copyright Getty Images

బ్రేకింగ్ న్యూస్: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ ప్రవేశించారు. ఈమెను ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ నియమించింది.

ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆమె ఆ బాధ్యతలు చేపడతారని పేర్కొంది.

మరోవైపు కేసీ వేణుగోపాల్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Image copyright Aicc

ఈయన కర్ణాటక ఇంచార్జిగానూ కొనసాగుతారని ఏఐసీసీ ప్రకటన తెలిపింది.

యూపీ పశ్చిమ ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు.

గులాం నబీ ఆజాద్‌ను హర్యానాకు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆజాద్, గెహ్లాట్ సేవలను ప్రశంసించారు.

"మాయావతి, అఖిలేష్‌లతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఓడించడానికి ఏమేం చేయాలో వాటిపై చర్చించేందుకు మేమెప్పుడూ సిద్ధమే." అని మహాకూటమిని ఉద్దేశించి రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రియాంక ఇప్పటి వరకూ సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్ బరేలీలలో ప్రచారానికే పరిమితమయ్యారు. తొలిసారిగా ప్రియాంకకు పార్టీలో అధికారికంగా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు.

ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి కేవలం ఉత్తర ప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా మంచి ఫలితాలనిస్తుందని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.

అయితే బీజీపీ దీనిపై తీవ్రంగా విమర్శించింది.

"బీజేపీ, కాంగ్రెస్‌లకున్న ప్రధాన తేడా ఇదే. భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబం. కానీ కాంగ్రెస్‌లో అలా కాదు. ఆ ఒక్క కుటుంబమే కాంగ్రెస్‌ పార్టీ" అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం