వీడియో: ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులేంటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులేంటి?

  • 26 జనవరి 2019

ప్రసవ సమయంలో గర్భిణులతో ఆస్పత్రుల్లో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారన్న ఫిర్యాదులు తరచూ వస్తుంటాయి. సిబ్బంది, నర్సులు అసభ్యంగా మాట్లాడడంతోపాటు, భౌతిక దాడులూ చేస్తారన్న ఆరోపణలున్నాయి.

ఆస్పత్రుల్లో గర్భిణులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి? వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అన్నది పరిశీలించేందుకు చండీగఢ్‌లోని 'పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్'(పీజీఐఎమ్ఆర్) ఓ అధ్యయనం చేసింది.

ఆసుపత్రుల్లో సిబ్బంది ప్రసవం కోసం వచ్చిన గర్భిణిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిని బూతులు తిడుతున్నారని, మాట వినకపోతే బెదిరిస్తున్నారని ఆ అధ్యయనంలో తేలింది.

ఈ నేపథ్యంలో గర్భిణులు తమ హక్కుల గురించి తెలుసుకుకోవాల్సిన అవసరం ఉంది.

ఆస్పత్రుల్లో జరుగుతున్న అలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులతో సిబ్బంది ఎలా ప్రవర్తించాలి? వారికి ఎలాంటి వసతులు కల్పించాలి? అన్న విషయాలకు సంబంధించి 'లక్ష్య' పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.

Image copyright others

ఆ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:

  1. ప్రసవ సమయంలో గర్భిణికి ప్రత్యేకమైన గది లేదా చోటు ఇచ్చి ఏకాంతాన్ని కల్పించాలి.
  2. పురుటి నొప్పులు వచ్చినపుడు కుటుంబ సభ్యులు గర్భిణి వద్దనే ఉండాలి.
  3. ప్రసవ సమయంలో గర్భిణికి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలానే ఉంచాలి.
  4. బల్లలను కాకుండా, లేబర్ బెడ్‌ను వాడాలి.
  5. గర్భిణులను మాటలతో కానీ, చేతల ద్వారా కానీ ఇబ్బందిపెట్టరాదు.
  6. వైద్యం చేస్తున్నపుడు, లేదా ప్రసవం తర్వాత డబ్బు అడగరాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)