పద్మశ్రీ పురస్కారాలు: సిరివెన్నెల, ద్రోణవల్లి హారిక, ప్రభు దేవా, గౌతం గంభీర్‌

  • 25 జనవరి 2019
సిరివెన్నెల Image copyright Sirivennela/FACEBOOK
చిత్రం శీర్షిక సిరివెన్నెల సీతారామ శాస్త్రి

భారత ప్రభుత్వం 2019 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది.

నలుగురికి పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.

విజేతల జాబితాను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.

ఛత్తీస్‌గఢ్ కళాకారిణి తీజన్ భాయ్, ప్రజా సంబంధాల విభాగంలో ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లె(విదేశీయుడు), వాణిజ్య పారిశ్రామిక రంగంలో అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్, రంగస్థల కళలో బల్వంత్ మోరేశ్వర్ పురందరేలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించారు.

పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన 14 మంది ప్రముఖుల్లో నటుడు మోహన్ లాల్, సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్‌(మరణానంతరం), పర్వతారోహకురాలు బచేంద్రిపాల్, ఉన్నారు.

ఈ ఏడాది కేంద్రం 94 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.

ఈ అవార్డుకు తెలంగాణ నుంచి సునీల్ ఛెత్రి(క్రీడలు-ఫుట్‌బాల్), సిరివెన్నెల సీతారామ శాస్త్రి(సినీ గీత రచయిత) ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కోటాలో యడ్లపల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయరంగం), ద్రోణవల్లి హారిక (క్రీడలు-చెస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

జుగాడ్ విధానంలో వినూత్న ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్త ఉద్ధవ్ కుమార్ భరలీకి కూడా పద్మశ్రీ ప్రకటించారు.

'ఆశా ఓ ఆశ్వాసన్' పేరుతో స్కూలు ప్రారంభించి, మురికివాడల్లోని పిల్లలకు విద్యను చేరువ చేసిన చాయ్ వాలా దేవరపల్లి ప్రకాశ్ రావును కూడా పద్మ అవార్డు వరించింది.

ఇంకా క్రికెటర్ గౌతం గంభీర్, సినీ నటులు మనోజ్ బాజ్‌పాయ్, ప్రభుదేవా, ఖాదర్ ఖాన్(మరణానంతరం), సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్‌లను కూడా పద్మశ్రీ వరించింది.

పద్మ అవార్డుల జాబితా...

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)