వీడియో: ‘‘హింస, కుల ఘర్షణలను నిరోధించే వారికే ఓటు వేస్తా’’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ‘‘హింస, కుల ఘర్షణలను నిరోధించే వారికే ఓటు వేస్తా’’

  • 27 జనవరి 2019

భారతదేశంలో మొదటి సారి ఓటు వేయబోతున్న యువతుల ఆలోచన ఎలా ఉంటుంది?

ఈ సమాజంలో ఎలాంటి మార్పులను వాళ్లు కోరుకుంటున్నారు? అనేది తెలుసుకునేందుకు బీబీసీ బృందం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల అంకితతో మాట్లాడింది.

ఒక స్వచ్ఛంధ సంస్థలో పనిచేస్తున్న అంకితది దళిత కుటుంబం. కులాల మధ్య రగిలిన కొట్లాటల చిచ్చుతో ఆమె చదువు ఆపేయాల్సి వచ్చింది.

‘‘మా గ్రామంలో దళిత - అగ్రకులాల మధ్య ఘర్షణలు జరిగినపుడు, మొట్టమొదటిసారి నా జీవితంలో తుపాకీ తూటాల శబ్దాలు విన్నాను. ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి’’ అని చెప్పింది అంకిత.

‘‘హింసను, కుల ఘర్షణలను ఎవరైతే నిరోధిస్తారో నేను 2019 ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేస్తాను. ఎందుకంటే కొట్లాటలు, హింస వలన మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారు’’ అని స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)