వీడియో: మా అన్న పక్కా ఇళ్లు కడితే ఆయన భార్య చనిపోయింది
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: మా అన్న పక్కా ఇళ్లు కడితే ఆయన భార్య చనిపోయింది

  • 29 జనవరి 2019

దేశం సాంకేతిక రంగంలో సత్తా చాటుతున్న ఈ రోజుల్లోనూ ఒక్కటైనా పక్కా ఇల్లు లేని గ్రామం ఉందంటే నమ్ముతారా..? కానీ, నమ్మితీరాల్సిందే.

రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ఉండే దేవమాలి గ్రామ ప్రజలు ఇప్పటికీ పూరిళ్లలోనే నివసిస్తున్నారు. కారణాలేంటో తెలుసుకోవడానికి అక్కడికి బీబీసీ ప్రతినిధి షకీల్ అఖ్తర్.

ఎత్తైన కొండలు, పచ్చిక భూముల మధ్య ఉండే గ్రామం దేవమాలి. ఇక్కడ ఎటు చూసినా పూరిళ్లే కనిపిస్తాయి. ఒక్క పంచాయతీ కార్యాలయం, ఆలయం తప్పించి, మరెక్కడా కాంక్రీటు పునాది కనింపించదు.

ఈ ఊరివాళ్లు దేవనారాయణుడిని పూజిస్తారు. కొన్ని శతాబ్దాల క్రితం ఆ దైవమే తమ పూర్వీకులను పక్కా ఇళ్లు కట్టుకోకుండా కట్టడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు