ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు మీకు కావాలా? అయితే ఈ వేలంలో దక్కించుకోండి

  • 30 జనవరి 2019
మోదీ బహుమతులు Image copyright Getty Images

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహుమతులుగా వచ్చిన వస్తువులు మీకు కావాలా? అయితే, దిల్లీలోని నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లండి.

ప్రధానికి వచ్చిన పలు రకాల బహుమతులను ఇక్కడ వేలానికి పెట్టారు. శాలువాలు, టర్బన్లు, ఖడ్గాలు, పెయింటింగులు, శిల్పాలతో పాటు పలు రకాల వస్తువులు ఈ వేలంలో ఉన్నాయి.

అయితే, విదేశాల నుంచి వచ్చిన బహుమతులను వేలానికి పెట్టడంలేదు.

ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన 'నమామీ గంగా' కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.

గంగా ప్రక్షాళనలో భాగంగా గంగానది పరిసర ప్రాంతాల్లో శ్మ‌శాన‌వాటిక‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, ఆధునీక‌రించ‌డంతో పాటు, కొత్త‌వాటిని నిర్మిస్తారు. అలాగే, గంగాన‌ది తీరంలోని ఘాట్ల‌కు మరమ్మతులు చేస్తారు, కొత్త ఘాట్ల‌ను నిర్మిస్తారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వేలంలో ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు

ఈ వేలంలో ఉంచిన ఒక్కో వస్తువు ఖరీదు రూ.200 నుంచి రూ.41,000 దాకా ఉంటుంది.

వాటిలో అత్యంత చవకైనది శాలువా.. అత్యంత ఖరీదైన వస్తువు చెక్క బైకు.

ఈ వస్తువులను వేలంలో కొనడమే కాదు, సాధారణ సందర్శకులు కూడా చూసే వీలుంటుంది.

"ప్రధానికి వచ్చిన బహుమతులను ఇలా వేలానికి పెట్టడం గొప్ప విషయం. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు" అని ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ జనరల్ అద్వైతా గరనాయక్ అన్నారు.

చిత్రం శీర్షిక ప్రధాని మోదీకి బహుమతిగా వచ్చిన చెక్క బైకు

"మోదీకి ఎలాంటి గిఫ్టులొచ్చాయో చూసేందుకు వచ్చాం. ఏది కొన్నా, అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక ప్రధాన మంత్రికి వచ్చిన బహుమతులను వేలంలో చూడడం ఇదే తొలిసారి" అని ఒక సందర్శకుడు అన్నారు.

"మోదీకి వచ్చిన బహుమతులను చూడడం ఆనందంగా ఉంది. అన్నీ చాలా బాగున్నాయి. ఇవి ఎంతో విలువైన వస్తువులు. ప్రేమ, అనుబంధాలకు సంబంధించినవి. వీటిని ఎవరు తీసుకున్నా వాటిలో ఆ ప్రత్యేకత ఉంటుంది." అని మరో సందర్శకుడు అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వేలంలో ఉన్న చిత్రాల్లో ఇది ఒకటి

"మామూలుగా బయట గిఫ్టులు కొనడం వేరు. వీటిని దక్కించుకోవడం వేరు. 'నమామీ గంగా' అనే ఒక మంచి కార్యక్రమం కోసం ఈ వేలం నిర్వహిస్తున్నారు. కాబట్టి, ఈ వస్తువుల కోసం మనం చెల్లించే డబ్బులు నేరుగా గంగానది ప్రక్షాళనకు ఉపయోగపడతాయి" అని ఇంకో సందర్శకురాలు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)