వీడియో: వేలంలో ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: వేలంలో ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు

  • 30 జనవరి 2019

ప్రధాన మంత్రినరేంద్ర మోదీకి బహుమతులుగా వచ్చిన వస్తువులు మీకు కావాలా? అయితే, దిల్లీలోని నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లండి.

ప్రధానికి వచ్చిన పలు రకాల బహుమతులను ఇక్కడ వేలానికి పెట్టారు. శాలువాలు, టర్బన్లు, ఖడ్గాలు, పెయింటింగులు, శిల్పాలతో పాటు పలు రకాల వస్తువులు ఈ వేలంలో ఉన్నాయి.

అయితే, విదేశాల నుంచి వచ్చిన బహుమతులను వేలానికి పెట్టడంలేదు.

ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన 'నమామీ గంగా' కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.

గంగా ప్రక్షాళనలో భాగంగా గంగానది పరిసర ప్రాతాల్లో శ్మ‌శాన‌వాటిక‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, ఆధునీక‌రించ‌డంతో పాటు, కొత్త‌వాటిని నిర్మిస్తారు. అలాగే, గంగాన‌ది తీరంలోని ఘాట్ల‌కు మరమ్మతులు చేస్తారు, కొత్త ఘాట్ల‌ను నిర్మిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)