పిల్లలకు పాలు తప్పనిసరిగా తాగించాలా

  • 31 జనవరి 2019
పాప

పిల్లలకు పాలు తప్పనిసరిగా తాగించాలా? పాలలో దొరికే పోషకాలను ఇతర ఆహార పదార్థాలతో భర్తీ చేయవచ్చా? అంటే.. చేయొచ్చని అంటున్నారు నిపుణులు.

పిల్లలకు పాలు అవసరం లేదని ఫిట్‌నెస్ ట్రైనర్ రుజుత దివేకర్ అంటున్నారు. బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, ఆలియా భట్ లాంటి సెలబ్రిటీలకు ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా పనిచేస్తున్నారు.

ఆమె NOTES FOR HEATHY KIDS పేరుతో రాసిన పుస్తకాన్ని 2018 డిసెంబర్‌లో విడుదల చేశారు.

ఈ పుస్తకం కవర్ పేజీ 'పిల్లలకు పాలు తప్పనిసరి కాదు' అని చెబుతుంది.

పాలలో కాల్షియం ఉంటుందని మనందరికీ తెలుసు. నువ్వుల చిక్కీలు, శనగపిండి లడ్డు, రాగి పాయసం, దోశతో కూడా కాల్షియాన్ని భర్తీ చేయవచ్చని రుజుత అంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: పిల్లలకు పాలు అవసరం లేదా?

కెనడాకు చెందిన పోషకాహార నిపుణులు కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అన్న వివరాలను 'ఫుడ్ గైడ్' పేరుతో కెనడా వైద్య శాఖ (హెల్త్ కెనడా) వెల్లడిస్తుంది.

ఈ గైడ్‌లో పాలు తప్పనిసరి అని చెప్పలేదు. ఆయా కాలాల్లో దొరికే పండ్లతో పాటు ఇతర పదార్థాల(సీజనల్ ఫుడ్)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కొందరు తల్లులు పాలల్లో చాక్లెట్ పౌడర్ లాంటివి కలిపి పిల్లలకు తాగిస్తుంటారు. కానీ, దాని వల్ల పిల్లలు లావైపోయే అవకాశం ఉంటుందని కెనడా నిపుణులు అంటున్నారు.

అలాంటి పౌడర్లు కలపడం వల్ల పాల ప్రయోజనాలు తగ్గిపోతాయని రుజుత చెబుతున్నారు. పిల్లలకు పాలు తాగించాలనుకుంటే అందులో మరేవీ కలపొద్దని ఆమె సూచిస్తున్నారు.

పాలతో పాటు, పాలతో చేసే పదార్థాల్లోనూ పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయని పోషకాహార నిపుణులు అవని కౌల్ అన్నారు.

కాల్షియం కోసం పిల్లలు బయట ఆడుకోవడం, వ్యాయామం చేయడం తప్పనిసరి.

బాదం, సోయా, రైస్ మిల్క్ లాంటి నాన్ డెయిరీ మిల్క్ కూడా పిల్లలకు ఇస్తుంటాం. వాటిని ఎక్కడ కొన్నా వాటి మీద లేబుల్ తప్పకుండా పరిశీలించాలి. అందులో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో లేవో చూడాలి. ఫార్టిఫైడ్ మిల్క్ అయితే పిల్లలకు మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు