వీడియో: నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అగ్నిప్రమాదం

  • 30 జనవరి 2019

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంక్ స్టాల్ నుంచి మంటలు చెలరేగినట్లు తెలిసింది. మంటలు వేగంగా మరిన్ని ఇతర స్టాల్స్‌కు వ్యాపించాయి.

సెలవు రోజు కావడంతో ఈరోజు సందర్శకులు అధిక సంఖ్యలోనే ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చారు. మంటలు చెలరేగడంతో జనం భయంతో పరుగులు తీశారు.

ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అన్నది తెలియలేదు. అయితే, ఆస్తినష్టం భారీగానే ఉండవచ్చని అంటున్నారు.

సంబంధిత అంశాలు