హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంటలు

  • 30 జనవరి 2019
హైదరాబాద్ ఎగ్గిబిషన్ గ్రౌండ్స్‌
చిత్రం శీర్షిక హైదరాబాద్ ఎగ్గిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్రా బ్యాంకు స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు వేగంగా ఇతర స్టాల్స్‌కు వ్యాపించాయి.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

పదికి పైగా ఫైరింజన్లు మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి.

అయితే, ఆ సమీపంలో బట్టల షాపులు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అగ్నిప్రమాదం

బుధవారం సాయంత్రం సందర్శకులు అధిక సంఖ్యలోనే ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చారు. మంటలు చెలరేగడంతో జనం భయంతో పరుగులు తీశారు.

ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అన్నది తెలియలేదు. అయితే, ఆస్తినష్టం భారీగానే ఉండవచ్చని అంటున్నారు.

చిత్రం శీర్షిక ప్రమాద స్థలాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో 'నుమాయిష్'గా పిలిచే ఈ పారిశ్రామిక ప్రదర్శన ప్రతి ఏటా జనవరి 1 నుంచి నెలన్నర రోజులు కొనసాగుతుంది.

ఈసారి ఈ ప్రదర్శనలో 2,500లకు పైగా స్టాల్స్ ఉన్నాయని చెబుతున్నారు. దాదాపు 50కి పైగా దుకాణాలు మంటల్లో కాలిపోయాయి.

చిత్రం శీర్షిక అగ్ని ప్రమాదంలో బుగ్గి అయిన స్టాల్స్

మంటలు వేగంగా వ్యాపించడంతో సందర్శకులు భయాందోళనలతో పరుగు తీశారు. ప్రమాద ఘటన వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు ఘటనా స్థలం నుంచి ప్రజలను దూరంగా తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు