Ind vs Nz: బోల్తా పడిన భారత బ్యాట్స్‌మెన్ ఇప్పుడు 92 అప్పుడు 54

  • 31 జనవరి 2019
cricket Image copyright Getty Images

న్యూజీలాండ్-భారత్ మధ్య హామిల్టన్‌లో జరిగిన నాలుగో వన్డేలో కెప్టెన్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగిన భారత్ ఓటమి మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇచ్చిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజీలాండ్ రెండు వికెట్లు కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేదించింది.

కివీస్ ఓపెనర్ నికోల్స్(30), టేలర్(37) జట్టుకు విజయం అందించారు. నాటౌట్‌గా నిలిచారు.

ఓపెనర్ గప్తిల్ 14, విలియమ్సన్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ రెండు వికెట్లు భవనేశ్వర్ కుమార్‌కే దక్కాయి.

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజీలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

కోహ్లీ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాడు.

ఓపెనర్లు శిఖర్ ధవన్(7), రోహిత్ శర్మ(13) ఇద్దరూ 23 పరుగులకే పెవిలియన్ చేరారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెవిలియన్‌కు వెళ్తున్న శుభమ్ గిల్

ఈ మ్యాచ్‌లో వన్డే అరంగేట్రం చేసిన శుభమ్ గిల్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు.

తర్వాత అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ 33 పరుగుల స్కోరు దగ్గర డకౌట్ అయ్యారు.

కేదార్ జాదవ్ కూడా ఒక్క పరుగుకే వికెట్ల ముందు దొరికిపోవడంతో 35 పరుగులకే టీమిండియా బ్యాట్స్‌మెన్లందరూ పెవిలియన్ చేరారు.

తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(16), కులదీప్ యాదవ్(15), యజువేంద్ర చాహల్(18) స్కోరును 92 లాక్కొచ్చారు.

భారత్ మొత్తం 30.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. జట్టులో టాప్ స్కోరర్ చాహల్ కావడం విశేషం.

5 వికెట్లు పడగొట్టిన న్యూజీలాండ్ బౌలర్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గ్రాండ్‌హోమె 3 వికెట్లు, ఆస్లే, నీషం చెరో వికెట్ తీశారు.న్యూజీలాండ్-భారత్ మధ్య హామిల్టన్‌లో జరిగిన నాలుగో వన్డేలో కెప్టెన్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగిన భారత్ ఓటమి మూటగట్టుకుంది.

టీమిండియా అత్యల్ప స్కోర్ 54

ఈ మ్యాచ్‌ను పక్కన బెడితే అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా లోయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా.. 54 పరుగులు.

19 ఏళ్ల కిందట శ్రీలంక భారత్‌ను 54 పరుగులకే ఆలవుట్ చేసింది.

అక్టోబరు 29, 2000లో షార్జాలో ఈ మ్యాచ్ జరిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది.

జయసూర్య అత్యధికంగా 189 పరుగులు చేసింది ఈ మ్యాచ్‌లోనే.

Image copyright Getty Images

తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్.. 26.3 ఓవర్లలో 54 పరుగులకు ఆలవుట్ అయింది.

ఆ మ్యాచ్‌లో రాబిన్ సింగ్ మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.

అతను 11 పరుగులు సాధించాడు. అదే ఆ మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్ మెన్ అత్యధిక స్కోర్.

శ్రీలంక బౌలర్ చమిందా వాస్ 14 పరుగలకు 5 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ మురళీధరన్ ఆరు పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

జయసూర్య మ్యాన్ ఆఫ్ ద మ్యచ్‌గా నిలిచాడు.

ఆ సిరీస్‌ను శ్రీలంక గెలిచింది.

అప్పుడు గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నారు.

Image copyright Getty Images

ఆ మ్యాచ్‌లో భారత్ వికెట్ల పతనం..

1-8 (గంగూలీ), 2-10 (సచిన్), 3-15(యువరాజ్), 4-19 (కాంబ్లీ), 5-30 (బదానీ)

6-39 (దహియా), 7-44 (రాబిన్ సింగ్), 8-49 (ఎస్బీ జోషి), 9-50(అజిత్ అగార్కర్), 10 -54 (జహీర్ ఖాన్)

వన్డే చరిత్రలో భారత్ అత్యల్ప స్కోర్లు

63 పరుగులు

1981 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో

78 పరుగులు

1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో

79 పరుగులు

2002లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో

ఇక వన్డేల్లో లోయెస్ట్ స్కోర్ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2004లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 35 పరుగులకు ఆలవుట్ అయింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)