అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎదురు దెబ్బ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎదురు దెబ్బ

  • 2 ఫిబ్రవరి 2019

ఇ-కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2019, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వేల కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెడుతూ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయి. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్.. ఫ్లిప్ కార్ట్‌ను సొంతం చేసుకోవడంతో ఈ పోటీ మరింత వేడెక్కింది.

తమకు వాటాలు ఉన్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ల ద్వారా ఇ-కామర్స్ సంస్థలు విక్రయించకూడదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. అలాగే ఎక్స్‌క్లూజివ్ డీల్స్ పేరుతో అమ్మకాల్ని కూడా నిషేధించారు. అయితే ఇప్పటి వరకు ఈ పద్ధతుల్లో భారీ డిస్కౌంట్లు ఇస్తూ అమ్మకాలు పెంచుకుంటున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఇది ఎదురుదెబ్బేనని చెప్పాలి.

బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దేశీయ ఇ-కామర్స్ వ్యాపారులు, చిన్న సంస్థల యజమానుల ఒత్తిడి వల్ల ఈ కొత్త నిబంధనలు వచ్చాయి.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల గురించి బీబీసీ ప్రతినిధి సమీర్ హాస్మీ అందించిన కథనన్ని పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు