"కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వాలంటైన్స్ డే: "కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం

  • 14 ఫిబ్రవరి 2019

"ఇతర కులాల వారిని పెళ్లిచేసుకునేవారిని తీవ్రవాదులుగా చూస్తారు.." ఇది దళిత వర్గానికి చెందిన ఓ ప్రేమికుడి అభిప్రాయం.

చాలామంది యువతీయువకుల్లాగే శిల్ప కూడా కులవివక్ష గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆమె గుజరాత్‌లోని సౌరాష్ట్ర గ్రామీణ ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ యువతి.

ఫేస్‌బుక్‌ ద్వారా రవీంద్ర పరిచయమై, ఆ పరిచయం ప్రేమగా మారేంతవరకూ ఆమెకు దళితుడు అంటే ఏమిటో తెలియదు. వీరి పెళ్లికి అడ్డుగా ఉన్న పెద్దలను ఎదిరించి, ఇద్దరూ ఒక్కటయ్యారు.

దీంతో.. అంతవరకూ చేస్తున్న ఇంజినీర్ ఉద్యోగాన్ని రవీంద్ర కోల్పోవలసి వచ్చింది. రెండు రోజుల్లో జీవితం మారిపోయింది. తన జీవితంలోకి శిల్ప వచ్చి, వెలుగులు నింపింది.. ఆ వెలుగును కాపాడుకోవడం ఎలా?

వీరి ప్రేమకు శుభం కార్డు పడినా, వీరి వైవాహిక జీవితానికి ఆర్థిక సమస్యలు సవాలుగా నిలిచాయి. దీంతో ఇంజినీర్ రవీంద్ర కూలి పనులు చేయడం మొదలుపెట్టాడు.

తర్వాత వీరి ప్రేమ కథ ఎలా సాగిందో.. పై వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)