కశ్మీర్: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి, 34 మంది మృతి

పుల్వామా జిల్లాలోని లెత్పురా దగ్గర శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై జరిగిన ఐఈడీ పేలుడులో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, 44 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
జమ్మూ, కశ్మీర్లో ఈ మధ్య కాలంలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.
2500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లతో 78 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయ్‌పై గురువారం మధ్యాహ్నం అవంతిపొరలోని లతూమూడే దగ్గర ప్రయాణిస్తుండగా మందుపాతర పేలిందని అధికారులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
ఈ జవాన్లలో చాలామంది సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరేందుకు కశ్మీర్ వచ్చిన వాళ్లే.
300 కిలోమీటర్ల పొడవుండే ఈ వ్యూహాత్మక రహదారిని పారామిలిటరీ దళాలు, సైన్యం నిరంతరం గస్తీ కాస్తుంటుంది.
గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని 92- బేస్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. మందుపాతర పేలిన తర్వాత బిజీగా ఉండే ఈ హైవేపై రాకపోకలు నిలిపివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
దాడి జరిగిన సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న రెండు బస్సులకు ముందు వెనుక రెండు సెక్యూరిటీ వాహనాలు కూడా వెళ్తున్నాయి.
ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత మిలిటెంట్ గ్రూప్ జైషే మహమ్మద్ ప్రకటించింది.
దాడి జరిగిన వెంటనే ఒక ప్రకటన విడుదల చేసిన జేఈఎం ప్రతినిధి ముహమ్మద్ హసన్ తమ బృందంలోని పుల్వామాకు చెదిన డ్రైవర్ అదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ కమాండో ఈ దాడి చేశాడని తెలిపారు.
మిలిటెంట్ల దాడిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వీర జవాన్ల ప్రాణత్యాగం వృథా కాదు. దేశమంతా ఇప్పుడు భుజం భుజం కలిపి అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి" అని ప్రధాని ట్వీట్ చేశారు..
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులతో పుల్వామాలో పరిస్థితులను సమీక్షిస్తున్నానని తెలిపారు.
ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి, జనరల్ వీకే సింగ్ ఈ మిలిటెంట్ దాడి పిరికిపంద చర్య అని ట్వీట్ చేశారు.
"ఒక సైనికుడు, భారత పౌరుడుగా ఈ పిరికిపందచర్యతో నా రక్తం ఉడికిపోతోంది. పుల్వామాలో మన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి ఈ నిస్వార్థ బలిదానానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. మన సైనికుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటామని మాట ఇస్తున్నాను" అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ దాడిని పిరికిపంద చర్యగా ట్వీట్ చేశారు.
"జమ్ము-కశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై జరిగిన ఈ పిరికిపంద చర్యకు బాధపడుతున్నా. అమరజవాన్ల కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని రాహుల్ అన్నారు.
జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
"లోయ నుంచి భయానక సమాచారం అందింది. ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్కు చెందిన చాలా మంది జవాన్లు మృతి చెందారు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. గాయపడ్డవారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను" అని ఉమర్ ట్వీట్ చేశారు.
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- మండుతున్న కశ్మీర్: ఒక మరణం, అనేక ప్రశ్నలు
పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందడం విషాదం అన్నారు. "మా వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు మా సంతాపం. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం" అన్నారు.
ఈ దాడిపై స్పందించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ "జమ్ము-కశ్మీర్ పుల్వామా నుంచి దిగ్భ్రాంతి కలిగించే వార్త తెలిసింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మిలిటెంట్ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇందులో చాలా మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో దేశం అంతా ఒక్కటై నిలవాలి" అన్నారు.
హోంమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2018లో మొత్తం 250 మిలిటెంట్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 84 మంది జవాన్లు, 150 మంది పౌరులు మృతి చెందారు. ఈ ఏడాది గత ఆరు వారాల్లో 20 మంది మిలిటెంట్లు చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- ప్రేమికుల రోజు వెనకున్న కథేంటి?
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్‌డే ముందు రోజు..
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)