వీడియో: ఆంధ్రప్రదేశ్‌లో లంక కష్టాలు

వీడియో: ఆంధ్రప్రదేశ్‌లో లంక కష్టాలు

కృష్ణానది గురించి ఎందరో కవులు కవిత్వం రాస్తే, భావుకులు కృష్ణానది ఒంపుల గురించి పాటలు కట్టారు. కానీ అదే 'కృష్ణానది ఒడ్డున చావుపాటలు వినిపిస్తున్నాయ్' అని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

వైద్య సౌకర్యాలు లేకపోవడం లంక గ్రామాల ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఈ సమస్యే గ‌ర్భిణుల‌కు ప్రాణాంతకంగా మారుతోంది.

కృష్ణా జిల్లా శివారున ఉన్న నాగాయ‌లంక మండలంలో ప‌లు లంక గ్రామాలున్నాయి. వీటిల్లో, న‌దీపాయ‌ల మ‌ధ్య ఉన్న గ్రామాల ప్రజలు.. పట్టణానికి రావాలంటే, రెండుమూడుసార్లు పడవపై ప్ర‌యాణం చేయవలసి వస్తోంది. అలాంటి వాటిలో ఈల‌చెట్ల‌దిబ్బ గ్రామం కూడా ఒక‌టి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)