ఇయర్ ఫోన్స్‌ చెవిలో ఎంతసేపు పెట్టుకోవాలి

  • 19 ఫిబ్రవరి 2019
ఇయర్ ఫోన్స్ Image copyright Getty Images

మీకు సంగీతం ఇష్టమా? మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా?

అయితే, 4 నిమిషాలకు మించి ఇయర్ ఫోన్స్‌తో వినడం ప్రమాదం. ఇది మీకు తెలుసా?

ఇది కొనసాగితే, వినికిడి సమస్యలకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఆపకుండా అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదముంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం

హెయిర్ డ్రయర్‌ను కూడా 15 నిమిషాలకు మించి వాడకూడదు.

60 సెం.మీ. దూరంలో ఉన్న అలారం చేసే శబ్దం 60 డెసిబుల్స్. దాన్నే మంచానికి దగ్గరగా ఉంచకూడదంటారు. ఇక హెయిర్ డ్రయ్యర్ సంగతి సరేసరి.

చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే, పెద్ద శబ్దాలు దగ్గరగా వినడం రెండో కారణం అని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది.

పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు.

చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేం. ఇక దానికి చికిత్స ఉండదు.

ఇక అప్పుడు హియరింగ్ ఎయిడ్ వాడాల్సిందే. లేదంటే జీవితాంతం చెవుడుతో బాధపడాల్సిందే.

అందుకే 60 డెసిబుల్స్ పైబడిన స్థాయి శబ్దాలను దగ్గరగా వినడం హానికరమనే విషయాన్ని గుర్తించాలి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)