Fact Check: పుల్వామా దాడి తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాకిస్తాన్‌ను సమర్థించారా, నిజమేంటి?

  • 21 ఫిబ్రవరి 2019
అక్షయ్ కుమార్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అక్షయ్ కుమార్

భారత్‌లో తీవ్రవాదం ప్రాబల్యం గురించి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

దానిని "#BoycottAkshayKumar" అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్‌ను దేశ వ్యతిరేకి అని, ఆయనను సమాజం నుంచి బహిష్కరించాలంటూ చాలా ట్విటర్ హ్యాండిల్స్‌లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోలో అక్షయ్ కుమార్ "భారతదేశంలో కూడా తీవ్రవాదం ఉంది" అని చెబుతుంటారు.

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ న్యూస్ ఛానల్ 'దునియా న్యూస్' కూడా ఇలాంటి ఒక కథనాన్నే ప్రసారం చేసింది.

"అక్షయ్ కుమార్ టెర్రరిస్టు దేశాల్లో పాకిస్తాన్ పేరు ఉండడాన్ని ఖండించారని, బదులుగా టెర్రరిజం ప్రపంచమంతా ఉందని అన్నట్లు" తెలిపింది.

మా పరిశోధనలో ఈ వీడియోకు అసలు పుల్వామా దాడితో ఎలాంటి సంబంధం లేదని తేలింది.

వీడియో అసలు నిజం

ఈ వీడియో 2015లో 'బేబీ' సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కు సంబంధించినది. ఆ సమయంలో అక్షయ్ ఆ సినిమాలో తీవ్రవాదానికి ఉన్న సంబంధం గురించి మాట్లాడారు.

అసలు వీడియోలో అక్షయ్ కుమార్ "తీవ్రవాదం ఏ దేశంలోనూ లేదు. దాని మూలాలు మాత్రమే ఉన్నాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, పారిస్, పెషావర్ అంతా తీవ్రవాదం ఉంది. కొంతమంది టెర్రరిజంను వ్యాప్తి చేస్తున్నారు. దానిని ఏ దేశం సమర్థించదు" అన్నారు.

పుల్వామా దాడి విషయానికి వస్తే, అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు "భారత్ కే వీర్" రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు అందించాలని అక్షయ్ కుమార్ ప్రజలను కోరారు.

తన మాటలను తప్పుదారి పట్టిస్తూ వస్తున్న ట్వీట్స్ గురించి అక్షయ్ కుమార్ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి