#WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?

ఫొటో సోర్స్, Facebook
#WhyModi.. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోన్న హ్యాష్ ట్యాగ్ ఇది. 'మళ్లీ మోదీనే ఎందుకు ప్రధాని కావాలి?' అన్న ప్రశ్నను సంధిస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
మోదీ ఎందుకు మళ్లీ అధికారంలోకి రావాలో వివరిస్తూ కొందరు, ఆయన మళ్లీ ఎందుకు ప్రధాని కాకూడదో చెబుతూ ఇంకొందరు ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా నేడు ట్విటర్లో ఇది ట్రెండ్‌గా మారింది.
మోదీకి మద్దతిస్తూ #WhyModi పేరుతో ట్వీట్లు చేస్తున్నవారి పోస్టులను పరిశీలిస్తే...
'10ఏళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో ఒక్క రఫేల్ విమానాన్ని కొనడానికి కూడా డబ్బుల్లేవు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం 36 రఫేల్ జెట్లు, 22 అపాచే విమానాలు, ఎస్-400 మిసైళ్లు, ఇలా మరెన్నో దేశానికి తీసుకొచ్చింది' అని రిషీ బాగ్రీ అనే వ్యక్తి అన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి 100కి 80 మార్కులే వచ్చుండొచ్చు. 20-30 మార్కులు తగ్గినంత మాత్రాన, 100కి 10 మార్కులు వచ్చేవారిని ఎన్నుకోలేం కదా అని కరణ్ భాసిన్ అనే మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.
ప్రపంచం మనతో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇమేజ్ను మోదీ మార్చేశారని హర్షిత్ మౌర్య అనే యూజర్ అన్నారు.
మార్పు తేవాలనే ఆకాంక్ష, భవిష్యత్తుపై దృష్టి ఉన్న ప్రభుత్వం, గొప్ప విజన్.. ఇలా మోదీని నమ్మడానికి చాలా కారణాలున్నాయని హర్షిక అనే మరో యూజర్ పేర్కొన్నారు.
మరోపక్క మోదీ మళ్లీ ఎందుకు ప్రధాని కాకూడదో చెబుతూ, దేశ భద్రతను పెంచడంలో, డిజిటల్ ఇండియాగా మార్చడంలో, స్వచ్ఛ భారత్‌ను సంపూర్ణంగా అమలు చేయడంలో, స్మార్ట్ సిటీస్ నిర్మించడంలో, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడంలో... ఇలా అనేక విధాలుగా మోదీ విఫలమయ్యారు. అందుకే ఆయన మళ్లీ రాకూడదు అని 'సేవ్ ది సాయిల్' పేరుతో ట్విటర్లో ఓ యూజర్ పోస్ట్ చేశారు.
మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకం. నిరుద్యోగం పెరిగింది. పెద్దనోట్ల రద్దు విఫలమైంది. జీఎస్టీ అమలు గందరగోళంగా ఉంది. ఇలా మోదీ మళ్లీ వద్దనడానికి అనేక కారణాలున్నాయి అని 'షార్ప్ వ్యూస్' అనే ఐడీతో ఓ యూజర్ ట్వీట్ చేశారు.
మొత్తంగా శుక్రవారంనాడు ట్విటర్ లో #WhyModi హ్యాష్ ట్యాగ్ చర్చనీయాంశంగా మారింది. ఆ ట్యాగ్‌తో 38వేలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- పుల్వామా దాడి: రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
- Fact Check: 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- '39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపేశారు'
- సనాతన్ సంస్థ 'హిందుత్వ తీవ్రవాద' శిక్షణ కేంద్రమా?
- "కులాంతర వివాహం చేసుకుంటే తీవ్రవాదులేనా?" - అభిప్రాయం
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)