రూ.900 కోట్ల వజ్రాన్ని నిజాం నవాబు పేపర్ వెయిట్‌గా ఎందుకు వాడారు?

రూ.900 కోట్ల వజ్రాన్ని నిజాం నవాబు పేపర్ వెయిట్‌గా ఎందుకు వాడారు?

మీరు ఇప్పటివరకూ ఎంత పెద్ద వజ్రాన్ని చూశారు. అందాల కిరీటాల్లోనో, ఆభరణాల్లోనో, పెద్ద పెద్ద ఉంగరాల్లోనో మెరిసే డైమండ్స్ చూసుంటారు.

లేదంటే ఎక్కడో మ్యూజియంలో ఉన్న పెద్ద వజ్రాల గురించి తెలుసుకుని ఉంటారు.

కానీ, ఒకప్పుడు హైదరాబాద్ నిజాం దగ్గర 'పేపర్ వెయిట్‌'లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉండనే విషయం మీకు తెలుసా. అంతే కాదు, బ్రిటిష్ వారి నుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్‌ను తన బూట్ల లోపల దాచిపెట్టేవారట..

నమ్మకం కలగడం లేదా, ఇక్కడ మీకు ఫొటోలో కనిపిస్తున్న వజ్రం అదే. దీనికి ఒక పేరు కూడా ఉంది-జాకబ్ డైమండ్. ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గరున్న ఈ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఈ డైమండ్‌తో పాటు నిజాం నగలను దిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శనలో నిజాం నవాబులు వాడిన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఉంగరాలను మనం చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)