India vs Australia T20 : మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

మాక్స్ వెల్

ఫొటో సోర్స్, Getty Images

విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

127 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది.

ఆఖరు బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని సాధించింది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఏడు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లకు 126 పరుగులు చేసింది.

మొదటి ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగా.. తర్వాత రాహుల్, కోహ్లీ స్కోరుబోర్డును కాసేపు పరుగుపెట్టించారు. కేఎల్ రాహుల్ 36 బంతులకు 50 పరుగులు చేశాడు.

చివరి వరకూ ఆడిన ధోనీ 30 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ, పంత్, రాహుల్, కార్తీక్ వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో.. భారత్ కష్టాల్లోపడింది. ఆస్ట్రేలియా బౌలర్ నీల్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా సారథి ఆరోన్‌ ఫించ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

మొదటగా ఈ ఇరు దేశాల మధ్య రెండు టీ 20 మ్యాచ్‌లు తర్వాత అయిదు వన్డేలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)