టెన్త్, ఇంటర్, డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... రైల్వే శాఖలో 1,30,000 పోస్టుల భర్తీ

ఫొటో సోర్స్, South Central Railway
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. టెన్త్, ఇంటర్, డిగ్రీతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాందించే అవకాశం. లక్షా 30వేల ఉద్యోగాలకు రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు?
అర్హతలేంటి? సెలబస్ ఏంటి?
పరీక్షా విధానం ఎలా ఉండబోతోంది?
అప్లికేషన్లు ఎప్పుటి నుంచి తీసుకుంటారు?
ఫొటో సోర్స్, Getty Images
నాలుగు విభాగాల్లో పోస్టుల భర్తీ
రైల్వే శాఖ ప్రధానంగా నాలుగు విభాగాల్లో పోస్టులు భర్తీ చేయబోతోంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగాలు, లెవల్ 1 ఉద్యోగాలు.
లెవల్ 1 పోస్టులనే గతంలో గ్రూప్ డి ఉద్యోగాలు అని పిలిచేవాళ్లు.
లెవల్-1 విభాగంలో లక్ష పోస్టులు భర్తీ చేస్తారు. మిగిలిన 30వేల పోస్టులు నాన్ టెక్నికల్, పారామెడికల్‌లో ఉన్నాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ద్వారా ఈ నియామకాలు చేబడతున్నారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఫొటో సోర్స్, Getty Images
1. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 30వేల పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన వారు వీటికి అప్లై చేయవచ్చు. వీటిలో...
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- ట్రాఫిక్ అసిస్టెంట్
- గూడ్స్ గార్డు
- సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
- కమర్షియల్ అప్రెంటీసీ
- స్టేషన్ మాస్టర్ వంటి పోస్టులున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
2. పారామెడికల్ సిబ్బంది
పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
ఆర్ఆర్బీలు, ఆర్ఆర్సీలు ఇచ్చే నోటిఫికేషన్లో అర్హతలకు సంబంధించి సమగ్ర వివరాలు ఉంటాయి. ఈ విభాగంలో...
- స్టాఫ్ నర్సులు
- హెల్త్ ఇన్స్పెక్టర్
- మలేరియా ఇన్స్పెక్టర్
- ఫార్మాసిస్ట్
- ఈసీజీ టెక్నీషియన్
- ల్యాబ్ అసిస్టెంట్
- ల్యాబ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తారు.
మార్చి 4 తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
3. కార్యాలయ ఉద్యోగాలు
ఈ కేటగిరీలో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మార్చి 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.
4. లెవల్ 1 ఉద్యోగాలు (గ్రూప్ డి ఉద్యోగాలు)
రైల్వే శాఖ ప్రకటించిన ఉద్యోగాల్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి.
ఈ కేటగిరీలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వీటినే గతంలో గ్రూప్ డి ఉద్యోగాలు అనేవాళ్లు.
సాధారణంగా టెన్త్‌తో పాటు ఐటీఐ చదివిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. అయితే, ఉద్యోగాన్ని బట్టి, అర్హతలు మారే అవకాశం ఉంది.
ఈ విభాగంలో...
- ట్రాక్ మెయింటైయినర్ గ్రేడ్ 4
- ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, మెకానికల్ హెల్పర్లు, అసిస్టెంట్లు
- అసిస్టెంట్ పాయింట్ మెన్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు.
మార్చి 12 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
ముఖ్యమైన తేదీలు
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రతీ నాలుగు రోజుల విరామంతో ఒక్కో కేటగిరీ పోస్టుల దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
నాలుగు విభాగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవి.
అన్ని పోస్టులకు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వయసు
18 నుంచి 32 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న వారికి వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళలు, మైనార్టీలకు అప్లికేషన్ ఫీజు 250 రూపాయలుగా నిర్ణయించారు. మిగతా వారు 500 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఈసారి కొత్తగా ఈడబ్యూఎస్కి కూడా 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
సిలబస్ ఏంటి?
పోస్టుల స్థాయిని బట్టి సిలబస్‌లో మార్పులు ఉంటాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులకు డిగ్రీ చదివిన వారు అర్హులు. లెవల్ 1 ఉద్యోగాలకు టెన్త్‌తో పాటు ఐటీఐ చేసిన వారు అర్హులు. సిలబస్ కూడా ఆయా పోస్టుల కనీస అర్హత ఆధారంగానే ఉంటుంది.
అరిథ్‌మెటిక్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ ఎబిలిటీ విభాగాల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
అరిథ్‌మెటిక్ ఎబిలిటీ విభాగంలో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. వాస్తవ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సరి, బేసి సంఖ్యలు, సగటు, శాతాలు, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, పని - కాలం, కాలం - దూరం, రైలు వేగంపై ప్రశ్నలు ఉండొచ్చు. టెన్త్, ఇంటర్ స్థాయిల్లోనే గణిత ప్రశ్నలుంటాయి. మాత్స్ చదవని అభ్యర్థులని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు ఎక్కువగా మౌలిక అంశాల ఆధారంగానే ఉంటాయి.
జనరల్ అవేర్నెస్ విభాగంలో వర్తమాన సంఘటనలు, అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అంటే స్వదేశంలో ఇటీవల జరిగిన కీలక సంఘటనలపై ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, సంస్థలు ఇలా అనేక అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు. భారత దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యం, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థల గురించి అడగొచ్చు.
జనరల్ సైన్స్ విభాగంలో భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు తొమ్మిది, పది, ఇంటర్ స్థాయిలో ఉంటాయి. ప్రశ్నలన్నీ బేసిక్ అంశాలతో రూపొందిస్తారు.
అభ్యర్థికి విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం ఉందా? లేదా? అని లాజికల్ ఎబిలిటీ విభాగంలో పరీక్షిస్తారు. ఇందులోనే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ర్యాంకింగ్స్, వెన్‌చిత్రాలు, పజిల్ టెస్ట్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇవి కూడా చదవండి:
- గోసా ఎక్కడికి వెళ్ళినా... తేనెటీగలు ఆయనను వదిలిపెట్టవు
- పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు
- వర్జినిటీ ట్రీ: ఆ చెట్టుకు కండోమ్స్ కట్టి పూజలు చేస్తారు
- ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
- క్రికెట్: భారత్ కొంప ముంచింది ఉమేశ్ యాదవ్ బౌలింగా? ధోనీ స్లో బ్యాటింగా?
- ఆస్కార్ 2019: ఉత్తమ నటీనటులు - ఒలీవియా కోల్మన్, రమీ మాలిక్... ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్
- ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ప్రభావవంతంగా నియంత్రించిందా...
- ట్రంప్, కిమ్ భేటీ: నకిలీ కిమ్‌ను దేశం నుంచి బహిష్కరించిన వియత్నాం
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)