అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా? : Fact Check

  • 2 మార్చి 2019
అభినందన్ వర్ధమాన్ Image copyright Social Media
చిత్రం శీర్షిక అభినందన్ వర్ధమాన్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తనను విడుదల చేస్తున్నారనే ప్రకటన రాగానే పాకిస్తానీ సైన్యంతో కలసి డాన్స్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

విడుదల ప్రకటన రాగానే ఈ వీడియో అన్ని రకాల సోషల్ మీడియా వేదికలపైనా కనిపించింది. #WelcomeHomeAbhinandan, #PeaceGesture వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా షేర్ అయింది.

45 సెకన్ల ఈ వీడియోను వేలాది మంది చూశారు.

Image copyright SM Viral Post

అయితే, ఈ వైరల్ వీడియో నిజమైంది కాదని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీం పరిశోధనలో తేలింది. 4 నిమిషాల నిడివి కలిగిన దీని అసలైన, పూర్తి వీడియో ఫిబ్రవరి 23, 2019న యూట్యూబ్‌లో షేర్ అయ్యింది.

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఓ పాకిస్తానీ జానపద గీతానికి డాన్స్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

అంటే ఈ వీడియో ఫిబ్రవరి 23 కన్నా ముందే చిత్రీకరించారు. అందువల్ల వింగ్ కమాండర్ వర్ధమాన్ ఈ వీడియోలో ఉన్నారనడం అసత్యం. ఎందుకంటే ఆయనను ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సైన్యం అరెస్టు చేసింది.

Image copyright SM Viral Post

ఈ వీడియోలో ప్రతి ఫ్రేమునూ జాగ్రత్తగా పరిశీలిస్తే... అందులో డాన్స్ చేస్తున్న అధికారుంతా పాకిస్తాన్ యూనిఫాం వేసుకుని ఉన్నారనే విషయం తెలుస్తుంది.

కానీ, ప్రస్తుతం అభినందన్ విడుదల సందర్భంగా ఈ వీడియోలో కొంత భాగాన్ని షేర్ చేస్తూ అందులో అభినందన్ కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా