భారత్-పాకిస్తాన్: ఒక భారతీయ యుద్ధ వితంతువు కథ

  • 3 మార్చి 2019
హర్పాల్ సింగ్ భార్య దేవీందర్ కౌర్
చిత్రం శీర్షిక హర్పాల్ సింగ్ భార్య దేవీందర్ కౌర్

పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో జతువాల్ అనే గ్రామం ఇది. నాయక్ హర్పాల్ సింగ్ అంటే ఇక్కడ అందరికీ తెలుసు.

8 సిక్ రెజిమెంట్‌కు చెందిన హర్పాల్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయారు. ఆ రోజును హర్పాల్ భార్య దేవీందర్ కౌర్ ఎన్నటికీ మరచిపోలేరు. యుద్ధం మనుషులను, సంతోషాన్ని, అన్నింటినీ దూరం చేస్తుందని ఆమె చెబుతారు.

''నా భర్త చనిపోయినప్పుడు నా తల్లిదండ్రులు, బంధువులు అండగా నిలిచారు. ప్రభుత్వం మద్దతు అందించింది. అప్పుడు నా కొడుకు మూడు నెలల పసివాడు'' అని ఆమె తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionభారత్-పాకిస్తాన్: ఒక యుద్ధ వితంతువు కథ ఇది

కొన్నేళ్లుగా, తన భర్త పనిచేసిన రెజిమెంటే తన కుటుంబమని, ప్రతి నెలా రెజిమెంట్ వాళ్లు వచ్చి తమ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటారని దేవీందర్ కౌర్ చెప్పారు.

తన చిన్న కూతురు కచ్చితంగా సైన్యంలో చేరుతుందని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)