ఏపీలో అత్యధిక సంఖ్యలో ఓట‌ర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారో తెలుసా?

  • 11 మార్చి 2019
ఓటు హక్కు, మహిళ Image copyright Getty Images

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముహూర్తం ఖ‌రారు చేసింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఓట‌ర్ల జాబితా సిద్ధ‌మ‌య్యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓట‌ర్ల సంఖ్యలో ఈసారి స్వ‌ల్ప పెరుగుద‌ల క‌నిపించింది.

2014 ఎన్నిక‌ల్లో మొత్తం ఓట‌ర్లు 3,67,16,839 మంది ఉండగా, వారిలో 2,89,51,390 మంది అంటే 78.9 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోతున్న సాధార‌ణ ఎన్నిక‌ల తుది జాబితా ప్ర‌కారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. గ‌త ఎన్నిక‌ల‌తో సుమారుగా రెండు ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు పెరిగారు.

పురుషుల క‌న్నా మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం. మొత్తం ఓట‌ర్ల‌లో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే, థర్డ్ జెండర్స్‌ 3,761 మంది ఓటర్లు ఉన్నారు.

అత్యధికంగా ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. ఈ జిల్లాలో 40,13,770 మంది ఓట‌ర్లున్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.

Image copyright Getty Images

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:

1. శ్రీకాకుళం జిల్లా

మొత్తం ఓటర్లు- 20,64,330

మహిళలు- 10,28,460

పురుషులు- 10,35,623

ఇతరులు- 247

2. విజయనగరం జిల్లా

మొత్తం ఓటర్లు- 17,33,667

మహిళలు- 8,75,222

పురుషులు- 8,58,327

ఇతరులు- 118

3. విశాఖపట్నం జిల్లా

మొత్తం ఓటర్లు- 32,80,028

మహిళలు- 16,48,709

పురుషులు- 16,31,161

ఇతరులు- 158

4. తూర్పు గోదావరి జిల్లా

మొత్తం ఓటర్లు- 40,13,770

మహిళలు- 20,18,747

పురుషులు- 19,94,639

ఇతరులు- 384

5. పశ్చిమ గోదావరి జిల్లా

మొత్తం ఓటర్లు- 30,57,922

మహిళలు- 15,49,155

పురుషులు- 15,08,403

ఇతరులు- 364

6. కృష్ణా జిల్లా

మొత్తం ఓటర్లు- 33,03,592

మహిళలు- 16,69,703

పురుషులు- 16,33,595

ఇతరులు- 294

7. గుంటూరు జిల్లా

మొత్తం ఓటర్లు-37,51,071

మహిళలు- 18,43,098

పురుషులు- 19,07,552

ఇతరులు- 421

8. ప్రకాశం జిల్లా

ఓటర్లు- 24,95,383

మహిళలు- 12,51,823

పురుషులు- 12,43,411

ఇతరులు- 149

9. నెల్లూరు జిల్లా

ఓటర్లు- 22,06,652

మహిళలు- 11,23,624

పురుషులు- 10,82,690

ఇతరులు- 338

10. కడప జిల్లా

మొత్తం ఓటర్లు- 20,56,660

మహిళలు- 10,40,400

పురుషులు- 10,15,964

ఇతరులు- 296

11. కర్నూలు జిల్లా

మొత్తం ఓటర్లు- 28,90,884

మహిళలు- 14,51,258

పురుషులు- 14,39,183

ఇతరులు- 443

12. అనంతపురం జిల్లా

మొత్తం ఓటర్లు- 30,58,909

మహిళలు- 15,18,768

పురుషులు- 15,39,936

ఇతరులు- 204

13. చిత్తూరు జిల్లా

మొత్తం ఓటర్లు- 30,25,222

మహిళలు- 15,03,477

పురుషులు- 15,21,401

ఇతరులు- 344

Image copyright INCTELANGANA/FACEBOOK

చంద్రగిరి టాప్

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే 2014 ఎన్నిక‌లప్పుడు విశాఖ జిల్లా గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక ఓట‌ర్లున్నారు. ఆ త‌ర్వాత స్థానంలో భీమిలి అసెంబ్లీ స్థానం నిలిచింది.

అతి త‌క్కువ‌ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలుగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం, కృష్ణా జిల్లా పెడ‌న నిలిచాయి.

అయితే, ఈసారి అత్య‌ధిక ఓట‌ర్లు కలిగిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నిలిచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2,70,495 మంది ఓట‌ర్లున్నారు. వారిలో పురుషులు 1,33,434 కాగా, మ‌హిళ‌లు 1,37,018 మంది ఉన్నారు. మ‌రో 43 మంది ఇత‌రులున్నారు.

ఈసారి కూడా భీమిలి రెండో స్థానంలో నిలిచింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు-2,64,520 ఉన్నారు. వారిలో మహిళలు- 1,32,839, పురుషులు- 1,31,671, ఇతరులు-10 మంది ఉన్నారు.

అత్య‌ల్పంగా ఓట‌ర్లు కలిగిన అసెంబ్లీ స్థానాల్లో ఈసారి కూడా న‌రసాపురం, పెడ‌న నిలిచాయి. న‌ర‌సాపురంలో మొత్తం ఓటర్లు- 1,59,144 ఉన్నారు. వారిలో మహిళలు- 79,416 మంది, పురుషులు- 79,727 మంది ఉండ‌గా ఇతరులు కేవ‌లం ఒకే ఒక్క‌రు ఉండ‌డం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌.

ఆ త‌ర్వాత పెడ‌న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్లు- 1,59,215 మంది ఉన్నారు. వారిలో మహిళలు- 79,472 మంది కాగా, పురుషులు-79,736 మంది ఇతరులు- 07 మంది ఉన్నారు.

ఇక రాష్ట్రంలోనే ఇత‌రులు అత్య‌ధిక సంఖ్య‌లో ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గంగా కాకినాడ సిటీ నియోజ‌క‌వ‌ర్గం నిలిచింది. ఇక్క‌డ 138 మంది ఇత‌రులు ఓట‌ర్లుగా న‌మోద‌య్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)