లోక్‌సభ ఎన్నికలు: 16వ లోక్‌సభ‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్-4 ఎంపీలు తెలుగువారే

  • 29 మార్చి 2019
రేణుక Image copyright fb/butta renuka

2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పాటైన 16వ లోక్‌సభలో అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు నిలిచారు. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లతో పాటు ఏడీఆర్ నివేదిక ప్రకారం ఆ సంపన్న ఎంపీల వివరాలు ఇవీ...

టాప్-4: బుట్టా రేణుక

టాప్-4 సంపన్నులలో నాలుగో స్థానంలో ఉన్న ఎంపీ బుట్టా రేణుక. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎన్నికైన రేణుక ఆస్తుల విలువ రూ. 242 కోట్లు. ఆమె 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు.

తర్వాత కొన్ని రోజులకే టీడీపీలో చేరారు. ఇటీవల మళ్లీ ఆమె వైఎస్‌ఆర్‌సీపీ‌లోకి వచ్చారు.

Image copyright fb/gokaraju gangaru

టాప్-3: గోకరాజు గంగరాజు

సంపన్న ఎంపీల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు మూడో స్థానంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

తనకు రూ.288 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

Image copyright konda/fb

టాప్-2: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణకు చెందిన ఎం.పీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రిచెస్ట్ ఎంపీల లిస్టులో టాప్-2గా నిలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చెవేళ్ల నుంచి ఎంపీ గా పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఆస్తుల విలువ రూ. 528 కోట్లని ప్రకటించారు.

ఇటీవల ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Image copyright fb/galla

టాప్-1: గల్లా జయదేవ్

ఇక ఈ జాబితాలో నంబర్ వన్‌ స్థానంలో ఉన్న నేత గల్లా జయదేవ్. టీడీపీ నేత, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రస్తుత లోక్ సభలోని సంపన్న ఎంపీల జాబితాలో అత్యంత సంపన్నుడు. రూ. 683 కోట్ల ఆస్తులతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా తొలిస్థానంలో నిలిచారు.

ఈసారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)