జెట్ ఎయిర్వేస్: ఉంటుందా, మూతపడుతుందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి కారణాలేంటి?

  • 24 మార్చి 2019

జెట్ ఎయిర్వేస్ కొన్ని వారాలుగా వందల విమానాల సేవలను రద్దు చేసింది. పదేళ్లుగా ఈ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. వందల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని గడ్డు పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు ఎయిర్ ఇండియాను వెనక్కి నెట్టి ఇండియాలోనే నంబర్ వన్ విమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న జెట్ ఎయిర్వేస్ అథోపాతాళానికి పడిపోవడానికి కారణాలేంటి?

సిబ్బందికి జీతాల చెల్లింపు కూడా సంస్థకు సవాలుగానే మారింది. కొన్ని నెలలుగా వందల మంది సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించలేకపోతోంది సంస్థ. దీంతో ఏప్రిల్ 1 నుంచి విమానాలను నడపబోమని పైలట్లు తేల్చి చెబుతున్నారు.

జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ప్రభావం వినియోగదారులపైనా పడుతోంది. విమాన చార్జీలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగాయి.

జెట్ ఎయిర్వేస్‌కు ప్రస్తుతం నిధులు తక్షణం అవసరం. ఆ డబ్బు కూడా సంస్థను కొంతకాలమే నిలబెట్టగలదు.

సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ కంపెనీలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులు కావాలి. లాభాలు తెచ్చే ఒక వ్యాపార నమూనా కూడా దొరకాలి.

ఇవవీ జరక్కపోతే కొంత మంది భావిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ మూతపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)