ఐపీఎల్ 2019: దుమ్మురేపిన రస్సెల్... 19 బంతుల్లో 49 పరుగులు... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్‌ విజయం

  • 24 మార్చి 2019
అండ్రీ రస్సెల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆండ్రీ రస్సెల్ ఫైల్ ఫొటో

ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది.

మొదట టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది.

20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 181 పరుగులు చేసింది.

182 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మొదట తడబడింది.

క్రిస్, నితీశ్ రానా ఓపెనర్లుగా దిగారు. అయితే, 1.6 ఓవర్ల వద్ద 7 పరుగులు చేసి క్రిస్ పెవిలియన్‌కి చేరాడు.

87 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.

11.4 ఓవర్ల వద్ద ఉతప్ప పెవిలియన్ బాట పట్టాడు.

ఉతప్ప 27 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.

ఆ తర్వాత 95 పరుగుల వద్ద దినేశ్ కార్తిక్ ఔట్ అయ్యాడు..

నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన దినేశ్ కార్తిక్ పెవిలియన్‌ బాట పట్టాడు.

15 ఓవర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 114 పరుగులు చేసింది.

47 బంతుల్లో 68 పరుగులు చేసిన నితీశ్ రానా 118 పరుగుల వద్ద LBWగా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాల్లో పడింది.

ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ దుమ్ముదులిపాడు.

19 బంతుల్లో 49 పరుగులు చేశాడు.

19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డేవిడ్ వార్నర్

అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన 'సన్‌రైజర్స్ హైదరాబాద్' మొదటి నుంచి నిలకడగా ఆడింది.

డెవిడ్ వార్నర్, జానీ బేర్‌స్టవ్ ఓపెనర్లుగా వచ్చారు.

జానీ బేర్‌స్టవ్ 35 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేసి, 12.5 ఓవర్ల వద్ద ఔట్ అయ్యాడు.

డెవిడ్ వార్నర్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో మొత్తం 85 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.

16 ఓవర్లు ముగిసే సరికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 145 పరుగులు చేసింది.

ఆ తర్వాత విజయ్ శంకర్, యూసఫ్ పటాన్ బ్యాటింగ్‌కి వచ్చాడు.

152 పరుగుల వద్ద 'సన్‌రైజర్స్ హైదరాబాద్' మూడో వికెట్ కోల్పోయింది.

నాలుగు బంతుల్లో ఒక పరుగు చేసిన యూసఫ్ పటాన్‌ పెవిలియన్ బాట పట్టాడు.

మొత్తం 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 'సన్‌రైజర్స్ హైదరాబాద్' 181 పరుగులు చేసింది.

ఇదీ షెడ్యూల్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 మ్యాచ్‌లను హైదరాబాద్‌లోనే ఆడనుంది.

మార్చి 29న రాజస్తాన్ రాయల్స్‌తో, మార్చి 31న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది.

ఏప్రిల్ 6న ముంబయి ఇండియన్స్‌తో, ఏప్రిల్ 14న దిల్లీ కేపిటల్స్‌తో, ఏప్రిల్ 17న చెన్నై సూపర్‌కింగ్స్‌తో, ఏప్రిల్ 21న కోల్‌కత్ నైట్‌రైడర్స్‌తో, ఏప్రిల్ 29న కింగ్స్ లెవన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్ వేదికగా ఆడనుంది.

మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 మే మొదటివారం వరకు కొనసాగుతుంది.

2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది టోర్నీలో ఎలాంటి ఫలితం సాధిస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు