తినడానికి, వ్యాయామానికి మధ్య ఎంత విరామం ఉండాలి?

  • 29 మార్చి 2019
వ్యాయామం చేస్తున్న యువకుడు Image copyright PRANEETH

కొంతమంది బాగా తిన్నాక వ్యాయామం చేస్తే, తిన్నది అరిగిపోతుంది అనుకుంటారు. ఇది నిజమేనా?

తినడానికి, వ్యాయామానికి మధ్య ఎంత విరామం ఉండాలి?

తిన్న వెంటనే వ్యాయామం చేస్తే ఆశించిన ఫలితాలు రావడం కష్టం అంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్.

చిత్రం శీర్షిక రుజుత దివేకర్

"ఉదయం టిఫిన్ లేదా మధ్యాహ్నం భోజనం చేశాక వెంటనే వ్యాయామం చేయకూడదు. ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే, తినడానికి, వ్యాయామానికి మధ్య కనీసం గంట నుంచి గంటన్నర విరామం ఉండాలి. ఎందుకంటే, ఆహారం తీసుకున్నప్పుడు రక్తప్రసరణ మన పొట్టవైపు ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మనం శరీరంలో ఏ భాగంతో వ్యాయామం చేస్తున్నామో ఆ భాగం వైపు రక్తం ఎక్కువగా ప్రసరిస్తుంది. అంటే చేతులు, కాళ్లు, ఛాతీ... ఇలా ఏ భాగంతో వ్యాయామం చేస్తే ఆ భాగంవైపు జరుగుతుంది" అని రుజుత చెబుతున్నారు.

తినడానికి, వ్యాయామానికి మధ్యలో తగిన విరామం లేకపోతే వ్యాయామం సరిగ్గా చేయలేం, తిన్నదీ సరిగ్గా అరగదు. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం 60 నుంచి 90 నిమిషాల వ్యవధి తప్పనిసరి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆహారానికి, వ్యాయామానిక మధ్య ఎంత విరామం ఉండాలి?

ఒకవేళ అరటిపండులాంటి అల్పాహారం తీసుకుంటే ఈ వ్యవధి 10-15 నిమిషాలున్నా చాలు.

వ్యాయామం పూర్తై, అలసట తగ్గాక ఓ అరటిపండు, చపాతీ లాంటివి తినొచ్చు.

వ్యాయామం సరైన ఫలితాలివ్వాలంటే ముందు, తర్వాత ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం అని రుజుత సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)