ఎన్ని చట్టాలున్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఎన్ని చట్టాలున్నా మహిళలపై నేరాలు ఎందుకు తగ్గడం లేదు

  • 30 మార్చి 2019

మహిళలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. చిన్న పిల్లపై తీవ్ర లైంగిక నేరాల విషయంలో మరణశిక్ష కూడా విధించేలా చట్టాల్ని సవరించారు. మైనర్లపై జరిగే నేరాల నియంత్రణకు 2012లో పోక్సో చట్టం కూడా తీసుకువచ్చారు. 2013లో మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను కూడా బలోపేతం చేశారు.

2013లో భారీ సంఖ్యలో 35శాతం అధికంగా రేప్ కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. దీని తర్వాత చేపట్టిన మరికొన్ని చర్యలు కూడా ఈ సంఖ్య మరింత పెరగడానికి దోహదం చేశాయి. పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్యను పెంచడం, మహిళలు మాత్రమే పనిచేసే స్టేషన్లను ఏర్పాటు చేయడం, నిర్భయ నిధి వంటి చర్యలు మహిళలకు కొంత ధైర్యాన్నిచ్చాయి.

ఇన్ని చేసినా, లైంగిక నేరాల విషయంలో శిక్షలు పడటంలో మాత్రం పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. శిక్షల వరకూ వచ్చే కేసులు ఐదేళ్ల క్రితం ఉన్న 25శాతమే ఇప్పుడూ కొనసాగుతోంది.

బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య పరిశోధన...

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)