తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు -బీబీసీ 'మై విలేజ్ షో'
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు - బీబీసీ 'మై విలేజ్ షో'

  • 5 ఏప్రిల్ 2019

గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ... రైతుల్లో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కొత్తగా 18 ల‌క్షల 25 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.

కాళేశ్వరం నిర్వాసితుల పరిస్థితి మరోలా ఉంది. ప్రాజెక్టు కోసం భూములిచ్చి ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నవాళ్లు.. ఇళ్లు, పొలాలూ కోల్పోయి ఉపాధి కరవైన వాళ్లూ, చివరికి ఆత్మహత్య చేసుకున్నవాళ్లూ ఉన్నారు.

తెలంగాణకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు కొందరు రైతుల కళ్లలో ఆశలు నింపితే, ఇంకొందరికి మాత్రం కన్నీళ్లు మిగులుస్తోంది.

ఆ బాధితులు, ముంపు గ్రామాల పరిస్థితులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విశేషాలూ తెలుసుకునే ప్రయ్నతం చేసింది బీబీసీ. సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ ఉన్న 'మై విలేజ్ షో' బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో పాటు బాధితులతోనూ మాట్లాడి వారి అంతరంగాన్ని ఈ వీడియోలో ఆవిష్కరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)