‘సౌదీకి పోయి మా నాయన పిచ్చోడైనాడు’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘సౌదీకి పోయి మా నాయన పిచ్చోడైనాడు’

  • 5 ఏప్రిల్ 2019

ఎండాకాలం.. దట్టమైన ఎండ అన్నివైపులా పరుచుకుంది. ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ఇళ్లకు తాళాలు వేశారు. ఆ ఊళ్లో నాలుగైదు వీధులకు మించి లేవు. మనుషులు పలుచగా కనిపిస్తున్నారు. అది ఊరులా లేదు. ఒక్కో ఇంటిని దాటుకుంటూ నడుస్తున్నాం.

ఎదురుగా ఓ నడివయసు వ్యక్తి.. ఇంటి బయట గోడ కింద కూర్చున్నాడు ఆకాశంలోకి ఎటో చూస్తూ. నిర్లిప్తంగా ఉన్నాయ్ అతడి చూపులు. ఆయన్ను మాకు చూపిస్తూ..

''అదిగో.. అయప్పే సార్ రామ్మోహన్ అంటే! నేను చెప్పినానే.. సౌదీకి పోయి పిచ్చోడై వచ్చినాడని..!'' అన్నారు రమణమ్మ.

మేం రామ్మోహన్‌ను పలకరించగానే, అతడి కూతురు గౌతమి ఇంటి నుంచి బయటకొచ్చింది.

''మా నాయన మాట్లాడడు సార్'' అంది గౌతమి.

''వద్దు అన్నా ఇనకుండా మా నాయన దమ్మామ్‌ పోయినాడు సార్. మాకు భూముల్లేవు. అప్పులున్నాయి. అక్కడికి పోకముందు మా నాయన బాగుండె సార్. అక్కడకు పోయినంకే ఇట్లయిపాయ'' అంది గౌతమి.

ఇది రాయలసీమ కథ. రాయలసీమ తండ్రి కథ. మరిన్ని వివరాలకు పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)