ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: సంతృప్తికరంగా పోలింగ్.. ఆరింటికి ‘74 శాతం’ నమోదు: ఈసీ

  • 11 ఏప్రిల్ 2019
ఓటు, సార్వత్రిక ఎన్నికలు Image copyright Pib

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. అయితే, ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఆలస్యమైనా ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2,118 మంది.. 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

సంతృప్తికరంగా పోలింగ్: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది

ఏపీలో పోలింగ్ సంతృప్తికరంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.

సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. 6 గంటల వరకు 74 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిసిందని, పూర్తి వివరాలు అందవలసి ఉందన్నారు.

సాయంత్రం 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారిని రాత్రి ఎంత సమయం అయినా ఓటు వేయడానికి అనుమతిస్తారని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

పోలీస్ నివేదిక ప్రకారం ఘర్షణలు, రాళ్లు విసురుకోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో 25 జరిగినట్లు వివరించారు. ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు.

పోల్ డైరీ, వెబ్ క్యాస్టింగ్, వీడియో రికార్డింగ్ ల ఆధారంగా రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తగు చర్యల నిమిత్తమై పంపుతారని చెప్పారు.

ఈ మొత్తం అంశంపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. రీపోలింగ్ కు సంబంధించి తుది నిర్ణయం ఈసీఐ తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,959 పోలింగ్ బూత్ లు ఉన్నాయని చెప్పారు. మాక్ పోలింగ్ తరువాత ఈవీఎంలలోని డేటా తీసివేయని కేసులు ఆరు నమోదైనట్లు తెలిపారు.

విధుల నిర్వహణలో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు రుజువైతే, ఎన్నికల నియమావళిని అనుసరించి వారిపై చర్యలు తీసుకుంటారన్నారు.

ఈవీఎంల విధ్వంసానికి సంబంధించి ఏడు కేసులు నమోదైనట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 3 గంటల తరువాత పోలింగ్ జరగలేదని సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన నిమిత్తం పంపామని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

600 చోట్ల రీపోలింగ్‌కి టీడీపీ పట్టు

పోలింగ్ సమయం పొడిగించమని టీడీపీ అధికారులను కోరింది. స్పందించిన ఈసీ కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

అందరు కలెక్టర్లు ఒప్పుకుంటే.. మరో రెండుగంటలు.. పోలింగ్‌కి అనుమతి ఇస్తామని సీఈఓ ద్వివేది అన్నారు.

అయితే దానికి కూడా ఢీల్లీ లోని ఎన్నికల కమీషన్ అనుమతి అవసరమని ద్వివేది తెలిపారు.

మరోవైపు 600 చోట్ల రీ పోలింగ్‌కి టీడీపీ పట్టుబట్టింది.

ఇతర పార్టీలు కూడా ఇలా కోరుతున్న బూత్‌లకు సంబంధించిన రిపోర్టు తెప్పించమని అధికారులను ద్వివేది ఆదేశించారు.

సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం

రాష్ట్ర వ్యాప్తంగా 65.96 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం 63.77 %, విజయనగరం 74.18%, విశాఖపట్నం 55.82 %, తూర్పుగోదావరి 69.85 %, పశ్చిమగోదావరి 67.28 %, కృష్ణా 64.50 %, గుంటూరు 61.12 %, ప్రకాశం 70.74 %, నెల్లూరు 66.90 %, కడప 63.90 %, కర్నూలు 63 %, అనంతపురం 67.08 %, చిత్తూరు 69.32 %

17.30 చిత్తూరు జిల్లాలో ఘర్షణ, ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పీటీఎం మండలం టీ.సదుము గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరుడు వెంకటరమణా రెడ్డి మృతి చెందారని ములకలచెరువు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

16.30 ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈ. చిన్నయ్యపాలెంలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు.

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో ఓటు వేసేందుకు వెళ్తూ ఎండకు సొమ్మసిల్లి పడిపోయి కారెడ్ల సన్యాశిరావు (65) మృతి మృతి చెందారు.

మావోయిస్టుల మందుపాతరలను నిర్వీర్యం చేశాం: పోలీసులు

మావోయిస్టులు అమర్చిన మూడు శక్తిమంతమైన మందు పాతరలను నిర్వీర్యం చేసినట్లు విశాఖ పోలీసులు తెలిపారు. పెడబయలు మండలం సీకుపనస, మద్దిగరువు మధ్య అటవీ ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాతరలను అమర్చారని జిల్లా ఎస్పీ అట్టడా బాబూజీ చెప్పారు.

15.36 వైసీపీ అభ్యర్థిపై దాడి

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకింద పల్లి దగ్గర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక వైసీపీ కార్యకర్త గాయపడ్డారు.

15.20. శ్రీకాకుళంలో ఉద్రిక్తత

శ్రీకాకుళంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాంతో, దుకాణాలను మూయించిన పోలీసులు ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టారు.

15.15 చంద్రగిరిలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం కొత్త కండ్రిగలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురికి గాయాలయ్యాయి.

14.42 మధ్యాహ్నం 1గంట వరకు జిల్లాలవారిగా పోలైన ఓట్ల శాతం

శ్రీకాకుళం 37.92 %, విజయనగరం 53.19 %, విశాఖపట్నం 36.71 %, తూర్పుగోదావరి 41.21 %, పశ్చిమగోదావరి 37.51 %, కృష్ణా 36.42 %, గుంటూరు 36.08%, ప్రకాశం 41.48 %, నెల్లూరు 41.04 %, చిత్తూరు 42.60 %, కర్నూలు 40 %, కడప 43.92 %, అనంతపురం 38.80 %.

రాష్ట్రవ్యాప్తంగా పోలైన మొత్తం ఓట్ల శాతం 40.53 %

14:30 తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖలు, పత్రాలుచింతూరు మండలం మల్లంపేట -నర్సింగ పేట గ్రామాల మధ్య, ఈ ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టుల పేరుతో లేఖలు, గోడపత్రాలు కనిపించాయి. అల్లిగూడెం పోలింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ పోస్టర్లు కనిపించాయి. ప్రజలు మాత్రం, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌ల వద్దకు వెళుతున్నారు.

Image copyright Rajesh
Image copyright Rajesh

తాడిపత్రిలో ఘర్షణలో ఒకరు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ జీవీ అశోక్ కుమార్ చెప్పారు.

13.35

Image copyright Rammohan naidu
చిత్రం శీర్షిక శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

13.00 పోలింగ్‌ను హిష్కరించి నిరసన

విశాఖలో 9వ వార్డుకు చెందిన 1,800 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. తమను భౌగోళికంగా దగ్గరగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో కలపాలని డిమాండ్ చెస్తున్నా, పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు.

12.30 జిల్లాల వారిగా 11 గంటల వరకు పోలింగ్ శాతం

రాష్ట్రంలో 11 గంటల వరకు 23.22 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

జిల్లాల వారీగా చూస్తే...

శ్రీకాకుళం 19.78%, విజయనగరం 31.57%, విశాఖపట్నం 21.64 %, తూర్పుగోదావరి 27.50%, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47%.

చిత్రం శీర్షిక భీమవరంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన యువతులు

12.20 గుంటూరు జిల్లాలో ఘర్షణ

చిత్రం శీర్షిక టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చొక్కా చిరిగింది.

గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పోలింగ్ బూత్ పరిశీలిస్తుండగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోడెల చొక్కా చిరిగింది.

చిత్రం శీర్షిక పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధురాలు

12.10 "ఒక పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మరో పార్టీ అభ్యర్థికి వెళ్తోంది"

"ఒక పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మరో పార్టీ అభ్యర్థికి వెళ్తోంది" అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈవీఎంలు మొరాయించడం ద్వారా మూడు గంటల పాటు పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.

అయితే, రాజకీయ పార్టీల ఆరోపణలు నిరాధారమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.

రీ పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. మొదట్లో పోలింగ్‌కు ఆలస్యం కావడం వల్ల మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఆరు చోట్ల ఈవీఎంలు పాడయ్యాయని, అందుకు సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. 11 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పారు.

11.45

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది.

11.40 ఈవీఎంను రీస్టార్ట్ చేశారు

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈవీఎం మొరాయించింది. 52 మంది ఓటు వేసిన తర్వాత ఆ ఈవీఎంను రీ స్టార్ట్ చేశారు.

దాంతో ఓట్లు తొలగిపోయాయంటూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్న రిటర్నింగ్ అధికారులు.. బాధ్యులైన వీఆర్ఏను సస్పెండ్ చేశారు.

చిత్రం శీర్షిక ఆళ్లగడ్డలో ఘర్షణ

11.15 కర్నూలు జిల్లాలో ఘర్షణలు

అహోబిలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భూమా, గంగుల వర్గీయిలు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో తమ కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదని మంత్రి అఖిలప్రియ అన్నారు.

11.05 రాప్తాడులో ఘర్షణ

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దాంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత సేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిటాల శ్రీరామ్‌ను అక్కడి నుంచి పంపించారు.

11.00 నరసరావు పేటలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం ఉప్పలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

చిత్రం శీర్షిక విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్

10.54 పూతలపట్టులో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బందార్లపల్లెలో తెలుగుదేశం వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

10.20 తాడిపత్రిలో బారులు తీరిన ఓటర్లు

చిత్రం శీర్షిక అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో
చిత్రం శీర్షిక నర్సాపురంలో కేఏ పాల్

10.15 మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు

చిత్రం శీర్షిక కృష్ణా జిల్లా గన్నవరంలో క్యూ కట్టిన ఓటర్లు

9 గంటలు వరకు విశాఖపట్నం జిల్లాలో 7 శాతం, కడప జిల్లాలో 7.68 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

10.00 గుంతకల్ ఘటనపై స్పందించిన ఈసీ

అనంతపురం జిల్లా గుత్తి బాలికల కళాశాలలో పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేశారు.

గుంతకల్‌లో జరిగిన పరిణామాలపై వెంటనే స్పందించామని, ప్రత్యామ్నాయ ఈవీఎంతో పోలింగ్ ప్రస్తుతం సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. ఈవీఎం సమస్యలు పరిష్కారిస్తున్నామని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామన్నారు.

9.55 చిత్తూరు జిల్లా నగరిలో రోజా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిత్రం శీర్షిక ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు వస్తున్న తరలివస్తున్న ఓటర్లు.

9.44 వైసీపీ కార్యకర్తపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ నాయకులు మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, అనుచరులు వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు.

9.35 అరుకులోయ

పోలింగ్ కేంద్రాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయడకపోవడంతో ఉదయం నుండి బారులు తీరిన వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మండుతున్న ఎండలకు కనీసం పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం శీర్షిక పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9.05 పులివెందులలో వైఎస్ జగన్

కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసివెళ్లి ఓటు వేశారు.

9.00 చంద్రబాబు, నారా లోకేశ్

ఉండవల్లి మండల పరిషత్ పాఠశాలలో ఓటుహక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబ సభ్యులు.

8.55 పాడేరులో ప్రారంభం కాని పోలింగ్

విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలోని గుడివాడ బూత్ నెం.273, 275, 271, పాత పాడేరులోని 281 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

8.50 ఈవీఎంను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి

అనంతపురం జిల్లా గుత్తి బాలికల కళాశాలలో పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను ధ్వంసం చేశారు. దాంతో, పొలీసులు మధుసూదన్‌ను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఈవీఎం ఎక్కడుంది? ఎంపీలది ఈవీఎంలలో ఏది? అని ఓటర్లకు తెలిసేలా ఎక్కడా గుర్తులు పెట్టలేదని, పోలింగ్ బూత్‌లో బల్బులు కూడా ఏర్పాటు చేయలేదని బీబీసీతో మధుసూదన్ చెప్పారు.

కర్నూలులో

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని నార్లాపురం గ్రామంలో ఈవీఎం మొరాయించింది.

8.20 కుప్పంలో మొరాయించిన ఈవీఎంలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గుడిపల్లి మండలం శెట్టిపల్లి, బందార్లపల్లి, కుప్పం మండలంలోని పరమ సముద్రం, శాంతిపురం మండలంలోని ఎంకే పురం పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. పీలేరు పరిధిలోని 265వ పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎం మొరాయించింది.

పుంగనూరులో 36, 43,46, 55,56 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు పనిచేయలేదు.

చిత్రం శీర్షిక తిరుపతి నగరంలో పోలింగ్ తీరు

7.30 - ‘రాష్ట్రవ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయి’

తాడేపల్లి క్రిస్టియన్ పేట మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని తెలిపారు. టెక్నీకల్ టీం వాటిని రిపేర్ చేస్తారని వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కువినియోగించుకోవాలని, సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు.

7.00 - బారులు తీరిన ఓటర్లు

విశాఖపట్నం, కృష్ణా, కర్నూలు తదితర జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైన 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. బహుశా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ కావొచ్చుననే ఉద్దేశ్యంతో ఓటర్లు ఉదయంపూట ఓటు వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు.

అంకెల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

మొత్తం ఓటర్లు 3,93,45,717
పురుషులు 1,94,62,339
మహిళలు 1,98,79,421
ఇతరులు 3,957
పోలింగ్ కేంద్రాలు 45,920
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,000
పోలీస్ బలగాలు 1,20,000
Image copyright APgovt

ఏపీ లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు

క్రమసంఖ్య లోక్ సభ స్థానం టీడీపీఅభ్యర్థి వైసీపీఅభ్యర్థి జనసేనఅభ్యర్థి
01 అరకు(ఎస్టీ) కిశోర్ చంద్రదేవ్ గొడ్డేటి మాధవి వంపూరు గంగులయ్య
02 శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు దువ్వాడ శ్రీనివాస్ మెట్ట రామారావు
03 విజయనగరం పూసపాటి అశోక్ గజపతి రాజు బెల్లాన చంద్రశేఖర్ ముక్కా శ్రీనివాసరావు
04 విశాఖపట్నం భరత్ మతుకుమిల్లి ఎంవీవీ సత్యనారాయణ వీవీ లక్ష్మీనారాయణ
05 అనకాపల్లి ఆడారి ఆనంద్ కుమార్ భీశెట్టి వెంకట సత్యవతి చింతల పార్థసారథి
06 కాకినాడ చలమలశెట్టి సునీల్ వంగా గీతా విశ్వనాథ్ జ్యోతుల వెంకటేశ్వరరావు
07 అమలాపురం(ఎస్సీ) గంటి హరీశ్ మాధుర్ చింతా అనురాధ డీఎంఆర్ శేఖర్
08 రాజమండ్రి మాగంటి రూప మార్గాని భరత్ ఆకుల సత్యనారాయణ
09 నర్సాపురం వీవీ శివరామరాజు(కలవపూడి శివ) కనుమూరు రఘురామకృష్ణంరాజు నాగబాబు కొణిదెల
10 ఏలూరు మాగంటి బాబు కోటగిరి శ్రీధర్ పెంటపాటి పుల్లారావు
11 మచిలీపట్నం కొనకళ్ల నారాయణ వల్లభనేని బాలశౌరి బండ్రెడ్డి రామకృష్ణ
12 విజయవాడ కేశినేని నాని పొట్లూరి వరప్రసాద్ ముత్తంశెట్టి ప్రసాద్ బాబు
13 గుంటూరు గల్లా జయదేవ్ మోదుగుల వేణుగోపాలరెడ్డి బోనబోయిన శ్రీనివాసయాదవ్
14 నరసరావుపేట రాయపాటి సాంబశివరావు లావు శ్రీకృష్ణదేవరాయలు నయూబ్ కమల్ షేక్
15 బాపట్ల(ఎస్సీ) మాల్యాద్రి శ్రీరాం నందిగాం సురేశ్ కె.దేవానంద్(బీఎస్పీ)
16 ఒంగోలు శిద్ధా రాఘవరావు మాగుంట శ్రీనివాసుల రెడ్డి బెల్లంకొండ సాయిబాబు
17 నంద్యాల ఎం.శివానందరెడ్డి పోచ బ్రహ్మానందరెడ్డి ఎస్పీవై రెడ్డి
18 కర్నూలు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆయుష్మాన్ డాక్టర్ సంజీవ్ కుమార్ కె.ప్రభాకరరెడ్డి(సీపీఎం)
19 అనంతపురం జేసీ పవన్ రెడ్డి తలారి రంగయ్య డి.జగదీశ్
20 హిందూపూర్ నిమ్మల కిష్టప్ప కురువ గోరంట్ల మాధవ్ -
21 కడప చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డి గుజ్జల ఈశ్వరయ్య(సీపీఐ)
22 నెల్లూరు బీద మస్తాన్ రావు ఆదాల ప్రభాకరరెడ్డి చండ్ర రాజగోపాల్(సీపీఎం)
23 తిరుపతి(ఎస్సీ) పనబాక లక్ష్మి బల్లి దుర్గాప్రసాదరావు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు
24 రాజంపేట డీకే సత్యప్రభ పీవీ మిథున్ రెడ్డి సయ్యద్ ముకరం
25 చిత్తూరు(ఎస్సీ) ఎన్.శివప్రసాద్ ఎన్.రెడ్డప్ప సి.పుణ్యమూర్తి
Image copyright iwmp.telangana.gov.in
చిత్రం శీర్షిక కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌లో తొలిసారి పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అక్కడున్న ఓటర్ల కోసం సముద్రం మధ్యలోకి బోటులో వెళ్తున్న పోలింగ్ సిబ్బంది

ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు

క్ర.సం./ శ్రీకాకుళం జల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
1 ఇచ్చాపురం బెందాళం అశోక్ పిరియా సాయిరాజ్ దాసరి రాజు
2 పలాస గౌతు శిరీష సీదిరి అప్పలరాజు కోత పూర్ణచంద్రరావు
3 టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు పేరాడ తిలక్ కణితి కిరణ్ కుమార్
4 పాతపట్నం కలమట వెంకటరమణ శాంతి రెడ్డి గేదెల జ్ఞాన సాగర్
5 శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి ధర్మాన ప్రసాద రావు కోరాడ సర్వేశ్వరరావు
6 ఆముదాలవలస కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పేరాడ రామ మోహన రావు
7 ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు జి. కిరణ్ కుమార్ బాడాన వెంకట జనార్దన రావు
8 నరసన్నపేట బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణ దాసు మెట్ట వైకుంఠ రావు
9 రాజాం (ఎస్సీ) కొండ్రు మురళీ మోహన్‌ కంబాల జోగులు ముచ్చా శ్రీనివాసరావు
10 పాలకొండ (ఎస్టీ) నిమ్మక జయకృష్ణ వి. కళావతి డీవీజీ శంకర రావు (సీపీఐ)
విజయనగరం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన +
11 కురుపం (ఎస్టీ) ప్రియ థాట్రాజ్ పాముల పుష్ఫ శ్రీవాణి అవినాశ్ కుమార్ (సీపీఎం)
12 పార్వతీపురం (ఎస్సీ) బొబ్బిలి చిరంజీవులు ఎ. జోగరాజు గొంగడ గౌరీ శంకరరావు
13 సాలూరు (ఎస్టీ) భాంజ్ దేవ్ రాజన్న దొర బోనెల గోవిందమ్మ
14 బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగా రావు ఎస్‌వీ అప్పలనాయుడు గిరదా అప్పలస్వామి
15 చీపురుపల్లి కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ మైలపల్లి శ్రీనివాసరావు
16 గజపతినగరం కొండపల్లి అప్పలనాయుడు బొత్స అప్పల నరసయ్య రాజీవ్ కుమార్
17 నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడు బడుకొండ అప్పల నాయుడు లోకం నాగ మాధవి
18 విజయనగరం అదితి గజపతిరాజు కోలగట్ల వీరభద్ర స్వామి పాలవలస యశస్వి
19 శృంగవరపుకోట కె. లలిత కుమారి కడుబండి శ్రీనివాస రావు కామేశ్వర రావు పాలిపూడి (సీపీఐ)
విశాఖపట్నం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన +
20 భీమిలి సబ్బం హరి అవంతి శ్రీనివాస్‌ పంచకర్ల నాగ సందీప్
21 విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ విజయ నిర్మల అక్కరమణి తాతారావు కోన
22 విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ ద్రోణం రాజు శ్రీనివాస్‌ గిరిధర్ గంపల
23 విశాఖపట్నం ఉత్తరం గంటా శ్రీనివాసరావు కమ్మిల కన్నపరాజు పసుపులేటి ఉషాకిరణ్
24 విశాఖపట్నం పశ్చిమం పీజీవీఆర్ నాయుడు (గణబాబు) విజయ ప్రసాద్‌ మళ్ల జమిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి (సీపీఐ)
25 గాజువాక పల్లా శ్రీనివాసరావు తిప్పల నాగిరెడ్డి పవన్ కల్యాణ్ కొణిదల
26 చోడవరం కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు కరణం ధర్మశ్రీ పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు
27 మాడుగుల గవిరెడ్డి రామానాయుడు బి. ముత్యాల నాయుడు జి.సన్యాసి నాయుడు
28 అరకు (ఎస్టీ) కిడారి శ్రావణ్ కుమార్ చెట్టి ఫాల్గుణ కిల్లో సురేంద్ర (సీపీఎం)
29 పాడేరు (ఎస్టీ) గిడ్డి ఈశ్వరి భాగ్యలక్ష్మి పసుపులేటి బాలరాజు
30 అనకాపల్లి పి.గోవింద సత్యనారాయణ అమర్నాథ్ గుడివాడ ఏవీఎస్ఎస్ పరుచూరి భాస్కర రావు
31 పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌ చింతలపూడి వెంకటరామయ్య
32 యెలమంచిలి పంచకర్ల రమేష్ బాబు యువీ. రమణమూర్తి రాజు సుందరపు విజయ్‌ కుమార్‌
33 పాయకరావుపేట (ఎస్సీ) డాక్టర్. బుడుమూరి బంగారయ్య గొల్ల బాబురావు నక్కా రాజబాబు
34 నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల పి. ఉమశంకర్‌ గణేష్‌ -----
తూర్పు గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
35 తుని యనమల కృష్ణుడు దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా) రాజా వత్సవాయి వెంకట కృష్ణమ రాజు
36 పత్తిపాడు వరపుల జోగిరాజు (రాజా) పూర్ణ చంద్రప్రసాద్ పర్వత వరపుల తమ్మయ్యబాబు
37 పిఠాపురం ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పెండెం దొరబాబు మాకినీడు శేషుకుమారి
38 కాకినాడ రూరల్ పిల్లి అనంత లక్ష్మీ కురసాల కన్నబాబు పట్నం వెంకటేశ్వర రావు
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తోట వాణి తుమ్మల రామస్వామి
40 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రేలంగి నాగేశ్వరరావు
41 కాకినాడ సిటీ వనమాడి వేంకటేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముత్తా శశిధర్‌
42 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన పోలిశెట్టి చంద్రశేఖర్
43 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ పితాని బాలకృష్ణ
44 అమలాపురం (ఎస్సీ) అయితాబత్తుల ఆనందరావు పినిపె విశ్వరూపు శెట్టిబత్తుల రాజబాబు
45 రాజోలు (ఎస్సీ) గొల్లపల్లి సూర్యారావు బొంతు రాజేశ్వరరావు రాపాక వరప్రసాద్‌
46 పి.గన్నవరం (ఎస్సీ) నేలపూడి స్టాలిన్ బాబు కొండేటి చిట్టిబాబు పాముల రాజేశ్వరి
47 కొత్తపేట బండారు సత్యానందరావు చిర్ల జగ్గిరెడ్డి బండారు శ్రీనివాసరావు
48 మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు పిల్లి సుభాశ్ చంద్రబోస్ వేగుళ్ల లీలాకృష్ణ
49 రాజానగరం పెందుర్తి వెంకటేష్ జక్కంపూడి రాజా రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని సూర్యప్రకాశ్ రావు అత్తి సత్యనారాయణ
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకుల వీర్రాజు కందుల దుర్గేష్‌
52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ జ్యోతుల చంటిబాబు పాతంశెట్టి సూర్యచంద్ర రావు
53 రంపచోడవరం (ఎస్టీ) వంతల రాజేశ్వరి నాగులపల్లి ధనలక్ష్మి సున్నం రాజయ్య (సీపీఎం)
పశ్చిమ గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
54 కొవ్వూరు (ఎస్సీ) వంగలపూడి అనిత తానేటి వనిత రవికుమార్ మూర్తి (బీఎస్పీ)
55 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు జీఎస్ నాయుడు అటికల రమ్యశ్రీ
56 ఆచంట పితాని సత్యనారాయణ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు జవ్వాది వెంకట విజయరామ్
57 పాలకొల్లు నిమ్మల రామానాయుడు చవటపల్లి సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ) గున్నం నాగబాబు
58 నర్సాపురం బండారు మాధవ నాయుడు ముదునూరి ప్రసాద్ రాజు బొమ్మిడి నాయికర్
59 భీమవరం పులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కొణిదల
60 ఉండి మంతెన రామరాజు పీవీఎల్ నరసింహారాజు భూపతిరాజు బలరాం (సీపీఎం)
61 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ కారుమూరి వేంకట నాగేశ్వరరావు పసుపులేటి రామారావు
62 తాడేపల్లిగూడెం ఈలి నాని కొట్టు సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్‌
63 ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు పుప్పాల శ్రీనివాస్ రావు నౌడు వెంకటరమణ
64 దెందులూరు చింతమనేని ప్రభాకర్ పటారి అబ్బయ్య చౌదరి గంటసాల వెంకట లక్ష్మీ
65 ఏలూరు బడేటి కోట రామారావు (బుజ్జి) ఆళ్ల నాని (ఏకే కృష్ణ శ్రీనివాస్) అప్పలనాయుడు రెడ్డి
66 గోపాలపురం (ఎస్సీ) ముప్పిడి వెంకటేశ్వరరావు తలారి వెంకట్రావు సిర్రా భరత్ రావు (బీఎస్పీ)
67 పోలవరం (ఎస్టీ) బొరగం శ్రీనివాసరావు తెల్లం బాలరాజు చిర్రి బాలరాజు
68 చింతలపూడి (ఎస్సీ) కర్రా రాజారావు వీఆర్ ఎలిజా మేక ఈశ్వరయ్య
కృష్ణా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
69 తిరువూరు (ఎస్సీ) కొత్తపల్లి జవహర్ కె. రక్షణ నిధి నంబూరి శ్రీనివాసరావు (బీఎస్పీ)
70 నూజివీడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
71 గన్నవరం వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు సయ్యద్ అఫ్సర్ (సీపీఐ)
72 గుడివాడ దేవినేని అవినాష్ కొడాలి నాని (వేంకటేశ్వర రావు) ---
73 కైకలూరు జయమంగళ వెంకట రమణ దూలం నాగేశ్వర రావు బి.వి. రావు
74 పెడన కాగిత కృష్ణ ప్రసాద్‌ జోగి రమేశ్ అంకెం లక్ష్మీ శ్రీనివాస్
75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర పేర్ని వెంకటరామయ్య (నాని) బండి రామకృష్ణ
76 అవనిగడ్డ మండలి బుద్ద ప్రసాద్ సింహాద్రి రమేశ్ బాబు ముత్తంశెట్టి కృష్ణా రావు
77 పామర్రు (ఎస్సీ) ఉప్పులేటి కల్పన కె. అనిల్ కుమార్ మేడిపల్లి ఝాన్సీ రాణి
78 పెనమలూరు బోడె ప్రసాద్ కొలుసు పార్థసారథి లంకా కరుణాకర్ దాస్ (బీఎస్పీ)
79 విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పోతిన వెంకట మహేష్
80 విజయవాడ సెంట్రల్ బోండా ఉమా మహేశ్వరరావు మల్లాది విష్ణు చిగురుపాటి బాబూరావు (సీపీఎం)
81 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు బొప్పన భావ్ కుమార్ బత్తిన రామ్మోహన్ రావు
82 మైలవరం దేవినేని ఉమా మహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
83 నందిగామ తంగిరాల సౌమ్య జగన్ మోహన్ రావు పుష్పరాజు బచ్చలకూర (బీఎస్పీ)
84 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సామినేని ఉదయభాను ధరణికోట వెంకట రమణ కుమార్
గుంటూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
85 పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ నంబూరి శంకరరావు పుట్టి సామ్రాజ్యం
86 తాడికొండ (ఎస్సీ) తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ఉండవల్లి శ్రీదేవి నీలం రవి కిరణ్ (బీఎస్పీ)
87 మంగళగిరి నారా లోకేశ్ ఆళ్ల రామకృష్ణరెడ్డి ముప్పాళ్ల నాగేశ్వరరావు (సీపీఐ)
88 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కిలారి వెంకట రోశయ్య బోని పార్వతి
89 వేమూరు (ఎస్సీ) నక్కా ఆనందబాబు మెరుగు నాగార్జున ఏ.భరత్‌ భూషణ్‌
90 రేపల్లె అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణ కమతం సాంబశివ రావుే
91 తెనాలి అలపాటి రాజేంద్రప్రసాద్ అన్నాబత్తుని శివకుమార్‌ నాదెండ్ల మనోహర్‌
92 బాపట్ల అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కోన రఘుపతి ఇక్కుర్తి లక్ష్మీ నరసింహా రావు
93 ప్రత్తిపాడు (ఎస్సీ) డొక్కా మాణిక్యవర ప్రసాద్ మేకతోటి సుచరిత రావెల కిషోర్‌బాబు
94 గుంటూరు పశ్చిమ మద్దాల గిరిధర రావు చంద్రగిరి యేసురత్నం తోట చంద్రశేఖర్‌
95 గుంటూరు తూర్పు మహ్మద్ నజీర్ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా జియా ఉర్ రెహమాన్ షేక్
96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు విడదల రజని గాదె నాగేశ్వరావు
97 నరసరావుపేట డాక్టర్‌ అరవింద్‌ బాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సయ్యద్‌ జిలానీ
98 సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు అంబటి రాంబాబు యెర్రం వెంకటేశ్వర రెడ్డి
99 వినుకొండ జీవీ ఆంజనేయులు బోళ్ల బ్రహ్మనాయుడు చెన్న శ్రీనివాస రావు
100 గురజాల యరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్‌ రెడ్డి చింతలపూడి శ్రీనివాస్
101 మాచర్ల అన్నపురెడ్డి అంజిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముళ్ల శ్రీనివాస రావు
ప్రకాశం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
102 ఎర్రగొండపాలెం బూదాల అజితరావు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్ పీ. గౌతం రాజు
103 దర్శి కదిరి బాబురావు మద్దిశెట్టి వేణుగోపాల్‌ బొటుకు రమేష్
104 పర్చూరు ఏలూరు సాంబశివరావు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పెద్దపూడి విజయ్ కుమార్
105 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ బచ్చన చెంచు గరటయ్య కంచర్ల శ్రీకృష్ణ
106 చీరాల కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్‌ కట్టా రాజ్ వినయ్ కుమార్
107 సంతనూతలపాడు (ఎస్సీ) బి. విజయ్ కుమార్ టీజేఆర్‌ సుధాకర్‌బాబు జాల అంజయ్య (సీపీఎం)
108 ఒంగోలు దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాస రెడ్డి షేక్ రియాజ్
109 కందుకూరు పోతుల రామారావు మానుగుంట మహిధర్‌ రెడ్డి పులి మళ్లికార్జున రావు
110 కొండపి (ఎస్సీ) బాల వీరాంజనేయ స్వామి డాక్టర్‌ ఎం.వెంకయ్య కాకి ప్రసాద్ (బీఎస్పీ)
111 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కుందూరు నాగార్జున రెడ్డి ఇమ్మడి కాశీనాథ్
112 గిద్దలూరు ముత్తముల అకోశ్‌రెడ్డి అన్నా వెంకట రాంబాబు బైరబోయిన చంద్రశేఖర్
113 కనిగిరి ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ మన్నేపల్లి లక్ష్మీనారాయణ(సీపీఐ)
నెల్లూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
114 కావలి కాటంరెడ్డివిష్ణువర్ధన్‌ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పసుపులేటి సుధాకర్‌
115 ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్య మేకపాటి గౌతమ్‌ రెడ్డి చీర్ల చిన్నా రెడ్డి
116 కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి టి. రాఘవయ్య
117 నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ పోలుబోయిన అనిల్‌కుమార్‌ కేతం రెడ్డి వినోద్ రెడ్డి
118 నెల్లూరు రూరల్ అబ్దుల్‌ అజీజ్‌ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్‌రెడ్డి సుంకర హేమలత
120 గూడూరు (ఎస్సీ) పాసింసునీల్ కుమార్ వెలగపల్లివరప్రసాద్‌ రవి పట్టపు (బీఎస్పీ)
121 సూళ్ళూరుపేట (ఎస్సీ) పర్సా వెంకటరత్నయ్య కిలివేటి సంజీవయ్య ఉయ్యాల ప్రవీణ్
122 వెంకటగిరి కురుగొండ్లరామకృష్ణ ఆనం రామనారాయణరెడ్డి పల్లిపాటి రాజా (బీఎస్పీ)
123 ఉదయగిరి బొల్లినేని రామారావు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ---
కడప నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
124 బద్వేల్ (ఎస్సీ) ఓబులాపురం రాజశేఖర్ డా. వెంక‌ట‌ సుబ్బయ్య నాగిపోగు ప్రసాద్
125 రాజంపేట బత్యాల చెంగల్రాయుడు మేడా మల్లికార్జున రెడ్డి ప్రత్తిపాటి కుసుమ కుమారి
126 కడప అమీర్‌ బాబు అంజాద్ బాషా సుంకర శ్రీనివాస్
127 రైల్వే కోడూరు (ఎస్సీ) నర్సింహ ప్రసాద్ కొరముట్ల శ్రీనివాసులు బోనాసి వెంకట సుబ్బయ్య
128 రాయచోటి రమేశ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎస్.కె.హసన్ భాషా
129 పులివెందుల సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తుపాకుల చంద్ర శేఖర్
130 కమలాపురం పుత్తా నర్సింహారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ...
131 జమ్మలమడుగు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి డా. సుధీర్ రెడ్డి చిన్నగారి వినయ్ కుమార్
132 ప్రొద్దుటూరు లింగారెడ్డిమల్లెల రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమ శేఖర్ రెడ్డి
133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ రఘురామిరెడ్డి పందిటి మల్హోత్రా
కర్నూలు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
134 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గంగులబ్రిజేంద్ర రెడ్డి ఎస్. రామకృష్ణుడు
135 శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి సన్నపురెడ్డి సుజల
136 నందికొట్కూరు (ఎస్సీ) బండి జయరాజు తొగురుఆర్దర్ అన్నపురెడ్డి బాల వెంకట్
137 కర్నూలు టీజీ భరత్‌ హఫీజ్ ఖాన్ టీ. షద్రాక్ (సీపీఎం)
138 పాణ్యం గౌరు చరితా రెడ్డి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చింతా సురేష్
139 నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా రవిచంద్రారెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి
140 బనగానపల్లె బీసీ జనార్ధన్‌రెడ్డి కాటసాని రామిరెడ్డి అరవింద్ రాణి
141 డోన్ కేఈ ప్రతాప్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కె. రామాంజనేయులు
142 పత్తికొండ కేఈ శ్యాంకుమార్ కె. శ్రీదేవి కె.ఎల్. మూర్తి (సీపీఐ)
143 కోడుమూరు (ఎస్సీ) బి.రామాంజనేయులు జె.సుధాకర్ ఆరెకంటి జీవన్ రాజ్(బీఎస్పీ)
144 ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి చెన్నకేశవ రెడ్డి రేఖజవ్వాజ
145 మంత్రాలయం పి.తిక్కారెడ్డి బాల నాగిరెడ్డి బి.లక్ష్మన్న
146 ఆదోని మీనాక్షి నాయుడు సాయిప్రసాద్ రెడ్డి మల్లికార్జునరావు (మల్లప్ప)
147 ఆలూరు కోట్ల సుజాతమ్మ గుమ్మనూరు జయరామ్ ఎస్. వెంకప్ప
అనంతపురం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
148 రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి కె. మంజునాథ్ గౌడ్
149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర రెడ్డి ఎస్. రవి కుమార్
150 గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ వై. వెంకట్రామిరెడ్డి మధుసూదన్ గుప్తా
151 తాడిపత్రి జేసీ అశ్మిత్‌రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కదిరి శ్రీకాంత్ రెడ్డి
152 శింగనమల (ఎస్సీ) బండారు శ్రావణి జె. పద్మావతి మిద్దె రవీంద్ర బాబు (బీఎస్పీ)
153 అనంతపురం ప్రభాకర్ చౌదరి అనంత వెంకట రామిరెడ్డి వరుణ్
154 కళ్యాణదుర్గం ఉమామహేశ్వరనాయుడు కె.వి.ఉషా కరణం రాహుల్
155 రాప్తాడు పరిటాల శ్రీరాం టీ. ప్రకాష్ రెడ్డి సాకె పవన్ కుమార్
156 మడకశిర (ఎస్సీ) కె.ఈరన్న డాక్టర్ తిప్పేస్వామి మాల సోమన్న (బీఎస్పీ)
157 హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆకుల ఉమేష్
158 పెనుకొండ బీకే పార్థసారథి శంకర్ నారాయణ పెద్దిరెడ్డి గారి వరలక్ష్మి
159 పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పత్తి చలపతి
160 ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధుసూధన్‌ రెడ్డి
161 కదిరి కందికుంట వెంకటప్రసాద్‌ డాక్టర్ సిద్దారెడ్డి భైరవ ప్రసాద్ పెరుగు చిన్న
చిత్తూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
162 తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి
163 పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ...
164 మదనపల్లె దొమ్మాలపాటిరమేశ్‌ నవాజ్ భాషా స్వాతి గంగారపు
165 పుంగనూరు ఎన్.అనేషరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బోడె రామచంద్ర యాదవ్‌
166 చంద్రగిరి పులపర్తి వెంకట మణిప్రసాద్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిట్టిసురేంద్ర
167 తిరుపతి సుగుణ భూమన కరుణాకర్ రెడ్డి చదలవాడ కృష్ణమూర్తి
168 శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూధన్ రెడ్డి వినుత నగరం
169 సత్యవేడు (ఎస్సీ) జేడీ రాజశేఖర్‌ కె. ఆదిమూలం విజయ్ కుమార్ (బీఎస్పీ)
170 నగరి గాలి భానుప్రకాశ్ ఆర్.కె. రోజా నాగనబోయిన ప్రవళిక (బీఎస్పీ)
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) హరికృష్ణ నారాయణ స్వామి యుగంధర్.పీ
172 చిత్తూరు ఏఎస్‌ మనోహర్‌ ఎ.శ్రీనివాసులు ఎన్.దయారామ్
173 పూతలపట్టు (ఎస్సీ) లలిత కుమారి ఎం.ఎస్. బాబు యం. జగపతి
174 పలమనేరు ఎన్. అమర్‌నాథ రెడ్డి వెంకటయ్య గౌడ్ పోలూరు శ్రీకాంత్ నాయుడు
175 కుప్పం చంద్రబాబు నాయుడు చంద్రమౌళి వెంకటరమణ ముద్దినేని

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)