తెలంగాణ: ముగిసిన లోక్‌సభ ఎన్నికలు... 60.57 శాతం పోలింగ్

  • 11 ఏప్రిల్ 2019
కేసీఆర్ Image copyright ugc

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్రంలో 60.57 శాతం ఓటింగ్ నమోదైంది. మెదక్‌ పార్లమెంట్ పరధిలో అత్యధికంగా 68.25 శాతం పోలింగ్ నమోదవగా, సికింద్రాబాద్‌లో అత్యల్పంగా 39.20 శాతం పోలింగ్ నమోదైంది.

17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడగా, మెదక్ పార్లమెంట్ స్థానానికి అత్యల్వంగా 10 మంది బరిలోకి దిగారు.

ఈసారి ఎన్నికల్లో 25 మంది మహిళలు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపగా, ఎంఐఎం ఒక్క హైదరాబాద్ నుంచే పోటీకి దిగింది.

బీఎస్పీ 5, సీపీఐ 2, సీపీఎం 2 చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దింపింది. స్వతంత్ర అభ్యర్థులు 299 మంది ఈ సారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

Image copyright kavitha/fb

ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఉదయం సిద్ధిపేట నియోజకవర్గం చింతమడక చేరుకున్నారు. అక్కడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి, నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కవిత పొతంగల్‌లో ఓటు వేశారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీనటుడు చిరంజీవి సకుటుంబంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన, కూతురు శ్రీజ కూడా ఈ ఉదయమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు అల్లు ఆర్జున్ కూడా అక్కడికి చేరుకుని వోటు వేశారు.

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కూడా పోలింగ్ మొదలైన కాసేపటికే తన వోటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోయినపల్లి సెంట్ పీటర్స్ స్కూల్ ‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఓటు వేశారు.

పాల్వంచలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పోలింగ్ బూత్ ల వద్ద వచ్చిన ఓటర్లు ఓటు వేయకుండానే వెనుతిరుగుతున్నారు.

Image copyright ugc
చిత్రం శీర్షిక ఓటు హక్కు వినియోగించుకుంటున్న హైదారాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ

ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్..

పోలింగ్ ముగిసే సయమానికి తెలంగాణ‌లో మొత్తంగా 60.57 శాతం పోలింగ్ నమోదంది.

క్రమసంఖ్య లోక్ సభ స్థానం 9 గంటలకు 11 గంటలకు ఒంటి గంటకు 3 గంటలకు 5 గంటలకు
01 ఆదిలాబాద్ 12.90 శాతం 27.85 శాతం 45.06 శాతం 57.04 శాతం 66.76 శాతం
02 భువనగిరి 13 శాతం 26.95 శాతం 40.99 శాతం 57.41 శాతం 68.25 శాతం
03 చేవెళ్ల 8.9 శాతం 18.20 శాతం 29.93 శాతం 40.45 శాతం 53.80 శాతం
04 హైదరాబాద్ 8 శాతం 12.20 శాతం 20.59 శాతం 27.79 శాతం 39.49 శాతం
05 కరీంనగర్ 7.8 శాతం 15.77 శాతం 45.62 శాతం 58.1శాతం 68.00 శాతం
06 ఖమ్మం 8.2 శాతం 24 శాతం 41.65 శాతం 54.8 శాతం 67.96 శాతం
07 మహబూబాబాద్ 14.5 శాతం 32.09 శాతం 47.29 శాతం 55.24 శాతం 59.90 శాతం
08 మహబూబ్ నగర్ 15శాతం 27 శాతం 44 శాతం 56 శాతం 64.99 శాతం
09 మల్కాజిగిరి 6.71 శాతం 15.77 శాతం 27.07 శాతం 36.39 శాతం 42.75 శాతం
10 మెదక్ 13.50 శాతం 36.04 శాతం 54 శాతం 62.5 శాతం 68.60 శాతం
11 నాగర్‌కర్నూల్ 9.76శాతం 30.16 శాతం 45.82 శాతం 51.5 శాతం 57.12 శాతం
12 నల్లగొండ 11.56 శాతం 26.49 శాతం 42.09 శాతం 58.21 శాతం 66.11 శాతం
13 నిజామాబాద్ 3.60 శాతం 13.03 శాతం 38.10 శాతం 45.29 శాతం 54.20 శాతం
14 పెద్దపల్లి 14 శాతం 27.08 శాతం 47.50 శాతం 54.83 శాతం 59.24 శాతం
15 సికింద్రాబాద్ 6.50 శాతం 11.06 శాతం 23.85 శాతం 30.02 శాతం 39.20 శాతం
16 వరంగల్ 10.10 శాతం 25.97 శాతం 40.24 శాతం 51.05 శాతం 60.00 శాతం
17 జహీరాబాద్ 13.82శాతం 27.50 శాతం 52.45 శాతం 63.39 శాతం 67.80 శాతం
మొత్తం పోలింగ్ శాతం 10.60 శాతం 22.83 శాతం 38.80 శాతం 48.95 శాతం 60.57 శాతం
చిత్రం శీర్షిక ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చినట్లు తొలిసారి ఓటు వేసిన అనూష బీబీసీకి చెప్పారు.

పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..

క్రమసంఖ్య లోక్ సభ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇతరులు
01 ఆదిలాబాద్ జి. నగేశ్ రమేశ్ రాథోడ్ సోయం బాపురావు
02 భువనగిరి బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పడాల వెంకట శ్యామ్
03 చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బి.జనార్దన్ రెడ్డి
04 హైదరాబాద్ పుస్తె శ్రీకాంత్ ఫిరోజ్ ఖాన్ భగవంతరావు అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
05 కరీంనగర్ బి. వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ బండి సంజయ్
06 ఖమ్మం నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి దేవకి వాసుదేవరావు జి.వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్)
07 మహబూబాబాద్ మాలోత్ కవిత బలరాం నాయక్ హుస్సేన్ నాయక్
08 మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి చల్లా వంశీచంద్ రెడ్డి డీకే. అరుణ
09 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి రాంచంద్రర్ రావు బి. మహేందర్ రెడ్డి (జనసేన)
10 మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి గాలి అనిల్ కుమార్ రఘునందన్ రావు
11 నాగర్‌కర్నూల్ పి.రాములు మల్లు రవి బంగారు శృతి
12 నల్లగొండ వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఉత్తం కుమార్ రెడ్డి గార్లపాటి జితేందర్ మల్లు లక్ష్మీ (సీపీఎం)
13 నిజామాబాద్ కల్వకుంట్ల కవిత మధు యాష్కి గౌడ్ ధర్మపురి అర్వింద్
14 పెద్దపల్లి వెంకటేశ్ నేతకాని ఎ. చంద్రశేఖర్ రావు సోగాల కుమార్
15 సికింద్రాబాద్ తలసాని సాయికిరణ్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ జి. కిషన్ రెడ్డి
16 వరంగల్ పసునూరి దయాకర్ దొమ్మాటి సాంబయ్య చింతా సాంబమూర్తి
17 జహీరాబాద్ బీబీ పాటిల్ మదన్ మోహన్ రావు బాణాల లక్ష్మారెడ్డి

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ రెండు చోట్ల నుంచి విజయం సాధించింది. బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, వైసీపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి.

Image copyright fb/Chief Electoral Officer Telangana

నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి

ఈసారి ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటంతో ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ తొలిసారిగా ఎం3 ఈవీఎంలను వినియోగించారు. పోలింగ్ కేంద్రంలో L ఆకారంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌ను అమర్చారు.

అంకెల్లో ఎన్నికల వివరాలు

మొత్తం ఓటర్లు 2,97,08,599
పురుషులు 1,49,30,726
మహిళలు 1,47,76,370
ఇతరులు 1504
పోలింగ్ స్టేషన్లు 43,604
బ్యాలెట్ యూనిట్లు 77,365
వీవీప్యాట్లు 43,894
చిత్రం శీర్షిక 2014లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మ్యాప్ ఇది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ 15, వైసీపీ 8, బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందింది.

దేశవ్యాప్తంగా 91 లోక్ సభ స్థానాలకు

మొత్తం దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో పోలింగ్‌ జరుగుతుంది.

తొలి విడతలోనే అంటే ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతో పాటు మొత్తం 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది.

రెండో విడత పోలింగ్ ఏప్రిల్‌ 18, మూడో విడత ఏప్రిల్‌ 23, నాలుగో విడత ఏప్రిల్‌ 29, అయిదో విడత మే 6, ఆరో విడత మే 12, ఏడో విడత పోలింగ్ మే 19న జరుగుతుంది.

మే 23న దేశవ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)