ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 41 రోజుల్లో 24 కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం

  • 11 ఏప్రిల్ 2019
మద్యపానం, ఆరోగ్యం Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ఓటర్లకు భారీగా పంచడానికి తీసుకున్న మద్యం బాటిళ్లను సీజ్ చేసిన అధికారులు, పోలింగ్ రోజు వరకూ పట్టుబడిన మొత్తం మద్యం వివరాలను వెల్లడించారు.

మార్చి 1 నుంచి ఎన్నికల తేదీ వరకూ జిల్లాల వారీగా ఎన్ని లీటర్ల మద్యం పట్టుబడింది, దాని మొత్తం విలువ ఎంత అనేదానిపై అధికారులు లెక్కలు విడుదల చేశారు.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 70 లక్షల విలువ చేసే మద్యం పట్టుకున్న అధికారులు మొత్తం 1176 కేసులు నమోదు చేశారు.

జిల్లాల వారీగా అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం(లీటర్లలో), నమోదైన కేసులు, వాటి మొత్తం విలువ

సంఖ్య జిల్లా స్వాధీనం చేసుకున్న మద్యం (లీటర్లలో) నమోదైన మొత్తం కేసులు మద్యం మొత్తం విలువ
1 అనంతపూర్ 51,591.59 464 రూ.1,60,10,828.00
2 చిత్తూరు 83,300.81 392 రూ.2,60,75,913.00
3 తూర్పు గోదావరి 95,284.89 1176 రూ.2,70,34,910.00
4 గుంటూరు 57,356.12 702 రూ.2,57,44,739.00
5 కృష్ణా 35,374.96 588 రూ1,42,15,129.00
6 కర్నూలు 65,765.25 724 రూ.2,60,83,849.00
7 ప్రకాశం 28,922.28 343 రూ.1,40,92,914.00
8 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 33,248.30 233 రూ.1,62,72,440.00
9 శ్రీకాకుళం 33,788.95 766 రూ.1,03,01,481.00
10 విశాఖపట్నం 65,809.68 630 రూ.2,44,50,008.00
11 విజయనగరం 30,366.18 444 రూ.1,37,36,446.00
12 పశ్చిమ గోదావరి 23,150.18 424 రూ.1,10,03,579.00
13 వైఎస్ఆర్ కడప 39,968.73 262 రూ.1,45,99,941.00
మొత్తం 6,43,927.92 7,148 రూ.23,96,22,178.00

మద్యం స్వాధీనం చేసుకున్న సమయంలో దాదాపు ఆరు వేల మందిని అరెస్టు చేశామని, 760 వాహనాలను సీజ్ చేశామని కూడా అధికారులు తెలిపారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)