ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది? 2014 పోలింగ్ శాతం కంటే 2019లో తగ్గిందా? పెరిగిందా?

  • 13 ఏప్రిల్ 2019
ఓటు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 79.64 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014వ సంవత్సరంతో పోల్చితే ఈసారి ఓటింగ్ 1.68 శాతం పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటాక కూడా ప్రజలు క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో తుది పోలింగ్ శాతం వెల్లడించేందుకు ఎన్నికల సంఘానికి ఆలస్యమైంది.

రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉండగా, 3,13,33,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 58.19 శాతం మాత్రమే నమోదైంది.

కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ నగరాల్లోనూ 70 శాతంలోపే ఉంది. 2014 ఎన్నికల్లోనూ ఈ నగరాల్లో పోలింగ్ అదే స్థాయిలో ఉంది.

రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో 89.82 శాతం పోలింగ్‌ నమోదైంది.

నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది. అలాగే, 2014లో ఆయా నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాలు కూడా ఈ పట్టికలో చూడొచ్చు.

క్ర.సం./ శ్రీకాకుళం జల్లా నియోజకవర్గం 2019లో పోలింగ్ శాతం 2014లో పోలింగ్ శాతం
1 ఇచ్చాపురం 70.15 71.20
2 పలాస 72.92 71.52
3 టెక్కలి 78.79 77.40
4 పాతపట్నం 70.35 72.74
5 శ్రీకాకుళం 70.01 71.16
6 ఆముదాలవలస 78.51 76.26
7 ఎచ్చెర్ల 84.30 82.02
8 నరసన్నపేట 80 78.31
9 రాజాం (ఎస్సీ) 73.85 73.46
10 పాలకొండ (ఎస్టీ) 73.68 70.91
విజయనగరం నియోజకవర్గం 2019లో 2014లో
11 కురుపాం (ఎస్టీ) 77.38 74.15
12 పార్వతీపురం (ఎస్సీ) 76.78 73.99
13 సాలూరు (ఎస్టీ) 79 75.91
14 బొబ్బిలి 79.27 78.76
15 చీపురుపల్లి 83.07 80.66
16 గజపతినగరం 86.73 84.80
17 నెల్లిమర్ల 87.79 87.32
18 విజయనగరం 70.88 70.88
19 శృంగవరపుకోట 85.92 84.22
విశాఖపట్నం నియోజకవర్గం 2019లో 2014లో
20 భీమిలి 73.90 74.19
21 విశాఖపట్నం తూర్పు 64.73 64.03
22 విశాఖపట్నం దక్షిణం 61.15 64.98
23 విశాఖపట్నం ఉత్తరం 62.65 59.19
24 విశాఖపట్నం పశ్చిమం 58.19 59.08
25 గాజువాక 65.33 64.31
26 చోడవరం 84.26 84.01
27 మాడుగుల 83.67 83.92
28 అరకు (ఎస్టీ) 70.45 67.28
29 పాడేరు (ఎస్టీ) 61.80 58.05
30 అనకాపల్లి 77.54 78.14
31 పెందుర్తి 74.74 77.49
32 యలమంచిలి 84.49 85.12
33 పాయకరావుపేట (ఎస్సీ) 81.74 80.14
34 నర్సీపట్నం 82.33 81.41
తూర్పు గోదావరి నియోజకవర్గం 2019లో 2014లో
35 తుని 82.28 80.16
36 పత్తిపాడు 80.92 79.51
37 పిఠాపురం 80.99 78.70
38 కాకినాడ రూరల్ 74.12 73.31
39 పెద్దాపురం 81.39 76.36
40 అనపర్తి 87.48 85.14
41 కాకినాడ సిటీ 66.38 66.60
42 రామచంద్రాపురం 87.11 86.95
43 ముమ్మిడివరం 83.51 82.47
44 అమలాపురం (ఎస్సీ) 82.46 77.14
45 రాజోలు (ఎస్సీ) 79.44 76.70
46 పి.గన్నవరం (ఎస్సీ) 81.67 77.09
47 కొత్తపేట 84.30 83.51
48 మండపేట 85.52 86.84
49 రాజానగరం 87.47 85.17
50 రాజమండ్రి సిటీ 66.34 68.16
51 రాజమండ్రి రూరల్ 73.45 72.95
52 జగ్గంపేట 85.88 82.99
53 రంపచోడవరం (ఎస్టీ) 78.04 74.32
పశ్చిమ గోదావరి నియోజకవర్గం 2019లో 2014లో
54 కొవ్వూరు (ఎస్సీ) 86.01 84.32
55 నిడదవోలు 87.13 84.85
56 ఆచంట 81.46 80.80
57 పాలకొల్లు 81.55 82.21
58 నర్సాపురం 82.09 82.83
59 భీమవరం 77.60 77.27
60 ఉండి 84.73 85.31
61 తణుకు 80 80.73
62 తాడేపల్లిగూడెం 80.43 80.51
63 ఉంగుటూరు 86.86 85.56
64 దెందులూరు 84.70 86.14
65 ఏలూరు 67.59 70.17
66 గోపాలపురం (ఎస్సీ) 86.71 86
67 పోలవరం (ఎస్టీ) 86.55 84.65
68 చింతలపూడి (ఎస్సీ) 81.83 83.58
కృష్ణా నియోజకవర్గం 2019లో 2014లో
69 తిరువూరు (ఎస్సీ) 86.77 86.37
70 నూజివీడు 86.83 87.12
71 గన్నవరం 85.29 85.71
72 గుడివాడ 80.20 79.40
73 కైకలూరు 88.05 85.71
74 పెడన 86.92 85.42
75 మచిలీపట్నం 79.77 75.79
76 అవనిగడ్డ 88.11 84.54
77 పామర్రు (ఎస్సీ) 87.44 87.36
78 పెనమలూరు 79.90 78.82
79 విజయవాడ పశ్చిమ 66.12 64.31
80 విజయవాడ సెంట్రల్ 65.78 64.86
81 విజయవాడ తూర్పు 67.55 65.58
82 మైలవరం 83.48 85.23
83 నందిగామ 88.01 84.57
84 జగ్గయ్యపేట 89.64 88.80
గుంటూరు నియోజకవర్గం 2019లో 2014లో
85 పెదకూరపాడు 88.23 88.63
86 తాడికొండ (ఎస్సీ) 85.77 88.45
87 మంగళగిరి 83.49 84.97
88 పొన్నూరు 82.95 84.13
89 వేమూరు (ఎస్సీ) 87.53 85.22
90 రేపల్లె 82.83 83.21
91 తెనాలి 77.47 78.87
92 బాపట్ల 82.58 82.39
93 ప్రత్తిపాడు (ఎస్సీ) 84.21 84.87
94 గుంటూరు పశ్చిమ 65.68 64.66
95 గుంటూరు తూర్పు 89.99 67.82
96 చిలకలూరిపేట 85.51 85.68
97 నరసరావుపేట 81.50 83.33
98 సత్తెనపల్లి 87.77 84.27
99 వినుకొండ 88.16 85.30
100 గురజాల 83.52 80.94
101 మాచర్ల 88.41 80.46
ప్రకాశం నియోజకవర్గం 2019లో 2014లో
102 ఎర్రగొండపాలెం 87.23 82.96
103 దర్శి 89.62 90.60
104 పర్చూరు 87.56 87.43
105 అద్దంకి 89.82 89.41
106 చీరాల 83.76 80.71
107 సంతనూతలపాడు (ఎస్సీ) 83.86 82.53
108 ఒంగోలు 84.02 76.14
109 కందుకూరు 88.86 88.05
110 కొండపి (ఎస్సీ) 87.09 84.56
111 మార్కాపురం 85.22 80.48
112 గిద్దలూరు 81.89 81.12
113 కనిగిరి 82.23 75.75
నెల్లూరు నియోజకవర్గం 2019లో 2014లో
114 కావలి 76.19 78.78
115 ఆత్మకూరు 82.44 77.76
116 కోవూరు 77.92 79.83
117 నెల్లూరు సిటీ 65.42 56.76
118 నెల్లూరు రూరల్ 65.16 59.78
119 సర్వేపల్లి 82.42 84.52
120 గూడూరు (ఎస్సీ) 78.12 77.42
121 సూళ్ళూరుపేట (ఎస్సీ) 82.86 77.49
122 వెంకటగిరి 78.63 80.79
123 ఉదయగిరి 79.48 76.95
కడప నియోజకవర్గం 2019లో 2014లో
124 బద్వేల్ (ఎస్సీ) 77.64 72.22
125 రాజంపేట 76.07 77.83
126 కడప 62.14 58.70
127 రైల్వే కోడూరు (ఎస్సీ) 75.29 77.08
128 రాయచోటి 75.96 75.45
129 పులివెందుల 80.87 79.51
130 కమలాపురం 82.58 83.65
131 జమ్మలమడుగు 85.40 85.29
132 ప్రొద్దుటూరు 76.67 77.38
133 మైదుకూరు 82.60 83.60
కర్నూలు నియోజకవర్గం 2019లో 2014లో
134 ఆళ్లగడ్డ 84.26 77.87
135 శ్రీశైలం 82.54 80.36
136 నందికొట్కూరు (ఎస్సీ) 86.98 77.81
137 కర్నూలు 59.53 57.97
138 పాణ్యం 74.41 71.28
139 నంద్యాల 76.81 71.05
140 బనగానపల్లె 80.48 82.04
141 డోన్ 78.94 72.96
142 పత్తికొండ 83.97 78.27
143 కోడుమూరు (ఎస్సీ) 88.77 73.90
144 ఎమ్మిగనూరు 89.15 74.04
145 మంత్రాలయం 84.98 77.26
146 ఆదోని 65.31 64.89
147 ఆలూరు 79.71 75.36
అనంతపురం నియోజకవర్గం 2019లో 2014లో
148 రాయదుర్గం 86.02 84.53
149 ఉరవకొండ 86.20 84.95
150 గుంతకల్లు 75.78 73.81
151 తాడిపత్రి 81.25 78.75
152 శింగనమల (ఎస్సీ) 84.44 83.42
153 అనంతపురం 63.18 60.09
154 కళ్యాణదుర్గం 86.75 84.99
155 రాప్తాడు 82.33 83.60
156 మడకశిర (ఎస్సీ) 88.37 83.36
157 హిందూపురం 77.60 75.85
158 పెనుకొండ 86.99 82.38
159 పుట్టపర్తి 85.36 81.13
160 ధర్మవరం 86.50 83.60
161 కదిరి 79.95 74.59
చిత్తూరు నియోజకవర్గం 2019లో 2014లో
162 తంబళ్లపల్లె 84.00 81.51
163 పీలేరు 77,10 78.06
164 మదనపల్లె 73.44 69.37
165 పుంగనూరు 85.15 83.28
166 చంద్రగిరి 78.18 79.07
167 తిరుపతి 66.05 58.68
168 శ్రీకాళహస్తి 81.81 79.84
169 సత్యవేడు (ఎస్సీ) 86.09 82.49
170 నగరి 86.22 84.48
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) 85.86 83.72
172 చిత్తూరు 79.34 74.88
173 పూతలపట్టు (ఎస్సీ) 85.52 84.93
174 పలమనేరు 86.12 83.89
175 కుప్పం 85.47 83.33

పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతుందా? ఈ వీడియోలో చూడండి..

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపోలింగ్ శాతానికీ, ప్రభుత్వం మారానికీ లింకుందా?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.