భారతదేశంలోని ఓటర్లలో భీష్మ పితామహుడు... ఆయన ఓటు వేయని ఎన్నికలు లేవు

  • 18 ఏప్రిల్ 2019
ఎన్నికలు, 102 ఏళ్ల ఓటర్, శ్యామ్ శరణ్ నేగి
చిత్రం శీర్షిక శ్యామ్ శరణ్ నేగి

దేశంలో ప్రస్తుతం 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో అత్యంత పెద్ద వయస్కుల్లో శ్యామ్ శరణ్ నేగి ఒకరు. ఈయన వయసు 102 ఏళ్లు.

హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని హిమాలయా పర్వతాల నడుమ ఉన్న కల్పా గ్రామానికి చెందిన ఆయన 1917 సెప్టెంబర్ 4న జన్మించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 1951- 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని ఇప్పటి వరకు తాను ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదని శ్యామ్ శరణ్ అంటున్నారు. ఈసారి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption"నా వయసు 102 ఏళ్లు. 1952 నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నా"

2010లో ఎన్నికల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కల్పా గ్రామాన్ని సందర్శించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా నేగిని సత్కరించారు.

"స్వాతంత్ర్యం అనంతరం దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ రోజు నేను మరో ఊరిలో ఎన్నికల విధుల్లో ఉన్నాను. ఓటు వేయాలంటే మా ఊరుకు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో, నాకు ఓటు వేయాలని ఉందని ప్రిసైడింగ్ అధికారికి చెప్పాను. ఆయన అనుమతి ఇవ్వడంతో మా ఊరెళ్లి ఓటు వేశాను" అని శ్యామ్ శరణ్ నేగి తొలి ఎన్నికల నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

చిత్రం శీర్షిక శ్యామ్ శరణ్ నేగిది హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా అనే మారుమూల గ్రామం

ఓటు హక్కు అనేది మన చేతుల్లో ఉన్న సంపద అని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన అంటున్నారు.

"ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ఓటెయ్యకుండా ఉండలేదు. యువ ఓటర్లందరూ ఓటు వేయాలి. యువ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ ఓటు ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే, దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే మార్గం ఇదే. ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దేశం పురోగమిస్తుంది" అని నేగి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్: వారణాసి సహా 59 స్థానాల్లో కొనసాగుతున్న ఓటింగ్

పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీ

గుప్త నిధుల వేటలో ‘మూత్రం తాగి ప్రాణాలు దక్కించుకున్నా’ : ప్రెస్‌ రివ్యూ

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారు.. పార్లమెంటు ఎన్నికల్లో ఆస్ట్రేలియా ప్రధాని అనూహ్య విజయం

‘డ్రైవర్ గారూ, మాట్లాడకుండా డ్రైవ్ చేయండి’: ఉబర్

కేదార్‌నాథ్ గుహలో మోదీ ధ్యానం: కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసిన మొదటి ప్రధాని అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు

అద్వాణీ, వాజ్‌పేయిల కోసం ఇందిరా గాంధీ తమ ఎంపీలను రాజీనామా చేయమన్నారా

పాకిస్తాన్ గగనతలంపై నిషేధంతో భారత విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి